ధర్మపోరాటం

ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డది. ఆమె గర్భవతి యని, ఆమెకడుపులో కవలపిల్లలున్నారని కనుక్కున్నారు డాక్టర్లు . దీనికి కారణం ఆబాలికను రేప్ చేసిన ఆ బాలిక యొక్క మారు తండ్రని తెలిసింది.  అతడు ఆబాలిక ఆరవయేటనుండి అనేక విధాలుగా తిడుతూండేవాడట. ఆబాలిక మరీ బలహీనంగా వుండటం వల్ల ( 32 కిలోలు ), ఆమె గర్భాశయం కనీసం ఒక్క పిల్లనైనా భరించేంత శక్తికూడా లేనందున డాక్టర్లు ఆమెకు అబార్షన్ చెయ్యాలని నిర్ణయించారు.

కానీ ఆబాలిక నివసిస్తున్నప్రాంత  స్థానిక మతసంస్థ అయిన కథోలిక చర్చి ఏదియేమైనా ఆ బాలిక చచ్చుటయే మంచిదని తీర్మానించింది. బ్రెజిల్ దేశపు ఈశాన్యప్రాంతపు కథోలిక గురుమండల పీఠాధిపతి ఆర్చిబిషప్ స్వాములవారు  ఆ గర్భస్రావ చర్యను నిరోధించుటకు విఫలయత్నంచేశారు. ఎప్పుడైతే వారి ప్రయత్నాలు సాగలేదో ఆబాలిక తల్లిని, తన మాట వినని ఆ వైద్యబృందాన్నంతటినీ వెలివేసినట్లు ప్రకటించారు. 

ఈ సంఘటన కేవలం బ్రెజిల్ దేశ ఈశాన్యప్రాంతానికో లేక ఆ దేశానికో మాత్రమే సంబంధించినది కాదు.  మార్చి 7 వ తేదీన వెలివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న జనసందోహంతో వాటికన్ అధికార ప్రతినిధి కార్డినల్ గియోవన్నిబాటిస్టా రె తమ చర్యను సమర్థిస్తూ ఇది చర్చి నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.  వెలివేయడం అంటే వారికి చర్చీకి సంబంధించిన, మతానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరగుటకు వీలులేకుండ బహిష్కరించుట .  ఈ విథమైన  బహిష్కరణ సాధారణంగా జరిగే విషయాలు కావు. చాలా తీవ్రమైన చర్యలకు మాత్రమే ఈ బహిష్కరణ శిక్ష ఉంటుంది, కథోలిక మత సిద్థాంతాలను సవాలు చేసినా, మత విశ్వాసులను విభజించుటకు ప్రయత్నించినా, వారిని కన్ఫ్యూజ్ చేసినా సంఘ బహిష్కరణ శిక్ష విధించబడుతుంది. రేప్ చేసినటువంటి ఆ మారుతండ్రికి సంఘము నుండి వెలి వేయబడే శిక్ష విధించబడలేదు. కార్డినల్ గారు చెప్పిన ప్రకారం రేప్ చేయడం అనే పని అబార్షన్ చేయడం కంటే పెద్ద తప్పుకాదట. లాటిన్ అమెరికా దేశాలకు కూడా ఇన్చార్జి అయిన  ఈ కార్డినల్ గారు లా స్టంపా అనే ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఇంకా ఇలా అన్నారు. ఇది ఒక విషాదకరమైన విషయం కానీ ఇందులోని నిజమైన సమస్య ఏమిటంటే ఆబాలిక గర్భంలోని కవలలు ఇద్దరు అమాయకులైన వ్యక్తులువారికి గల జీవించే హక్కుహరించబడరానిది “.

వాస్తవానికి అబార్షన్ చెయ్యకపోయుంటే గర్భస్త శిశువులతోపాటు ఆకన్యక కూడా మృతిచెందివుండేదని వైద్యుల వాదన.

బ్రెజిల్ చట్టాల ప్రకారం తల్లిప్రాణానికి ప్రమాదం సంభవించగల సందర్భంలోనూ, గర్భస్థ శిశువుకు తండ్రి ఎవరో తెలియని సందర్భంలోనూ అబార్షన్ చెయ్యవచ్చు.

మరి వైద్యుల వాదనా, చర్చి వాదనలలో ఎవరి ఆలోచన సరైందని చెప్పవచ్చునో ఆలోచించండి.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. 1
  krishna Says:

  ఒక్క బ్రెజిల్ లో నే కాదు. ప్రపంచం లో ని మిసిఒనరీ ఫాదరి లు చాలా మంది ఈలా గే ప్రవర్తిస్తారు .
  వీరు మతం అనే విష వృక్షం అడ్డు పెట్టు కొని దుర్మార్గాలు సాగిస్తున్నారు .
  అయిన ప్రజలకు వారు చేపెందే వేదం . ఎప్పటి కి మారునో ఈ దురాచారం

 2. మన హిందువులు మాత్రం గడ్డి తినడం లేదా ఏమిటి? ఆడవాళ్ళని అణగతొక్కడంలో హిందూ మతానికి క్రైస్తవ మతానికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో భర్త చనిపోయిన స్త్రీకి బలవంతంగా గుండు గీసి తెల్ల చీర కట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి కూడా కేబుల్ టి.వి.లు, టెలీఫోన్ లు వచ్చాయి కానీ గ్రామీణ సంస్కృతిలో మాత్రం పెద్ద మార్పు రాలేదు.

 3. 3
  వాక్ 50 Says:

  మీరు చెప్పింది నిజం. ఎవరికారణంగానైతే స్త్రీల హక్కులు హరించబడుతున్నాయో వాటికే స్త్రీలు బానిసలు కావాల్సిరావడం నిజంగా విచారకరం.

 4. 4
  GP Says:

  Emi marthandaa gaaru, meeru ala jaruguthunapudu emayina marche prayatnam chesaaraa, alanti vaariki sahayam emayina chesaaraa,

 5. 5

  నేను దాని గురించి ఒక కథ వ్రాయాలనుకుంటున్నాను. ముందు ఈ కథ చదవండి: http://sahityaavalokanam.net/?p=216


RSS Feed for this entry

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: