లోకాయుత జ్ఞాన సిద్ధాంతం

26/05/2007

జ్ఞాన సముపార్జనకు లోకాయతులు ఇంద్రియాల పైనే ఆధారపడ్డారు. జ్ఞాన సంపాదన కోసం ప్రమాణాలు తార్కికంగా వివిధాలున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తప్రమాణం, ఆగమ ప్రమాణం (వేద ప్రమాణం) ఇట్లాంటివి వున్నాయి.
ప్రత్యక్షానుమానోపమాన శాబ్దాః ప్రమాణాని…”
ప్రత్యక్షోహ్యేత య్మోరూలం
కృతాంతై తిహ్య యోరపి|
ప్రత్యక్షేణా గమో భిన్నః
కృతాంతోవా న కించన||”మానవ జ్ఞాన సంపాదనకు ప్రత్యక్షమే పరమావధి.ఎన్ని ప్రమాణాలున్నా ప్రత్యక్షానుభూతికి లొంగక తప్పదు. మతం చూపే ప్రమాణ గ్రంధాలన్నీ అనుభవానికి దూరంగా వుంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష ప్రమాణానికి నిలువవు.ఋజువుకు పనికిరావు. అనుమానం మొదలైన ప్రమాణాలను చార్వాకులు తిరస్కరించారు. అయితే అవి అన్నివిషయాలలో గాదు.
యత్ర యత్రాను మానేస్మిన్
కృతం భావయతో పిచ|
నాన్యో జీవః శరీరస్య
నాస్తికానాం మతే స్థితః||”అనుమాన ప్రమాణానికి సంబంధించినంతవరకూ ఏదీ ముఖ్యమైంది కాదు. అశాస్త్రీయ గ్రంధాలైన మత గ్రంధాలనాధారంగా చేసుకొనీ, మతాలు చెప్పే నమ్మకాలకు సంబంధించి అనుమాన ప్రమాణాన్ని గానీ నమ్మి ఆత్మ సిద్ధాంతాన్ని ఋజువు చెయ్యలేం.
                 అంటే చార్వాకులు – అనుమానాది ప్రమాణాలను త్రోసిపుచ్చి కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే నమ్ముతారని మాధవాచార్యులు తమాషాగా వక్రీకరించి ఈ సిద్ధాంతం పట్ల మేధావులకు వైముఖ్యం కలిగేట్లు చేయడానికి యత్నం చేశాడు.
               తన సర్వ దర్శన సంగ్రహం లో లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని వివరిస్తూ వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని తిరస్కరిస్తారని చెప్పాడు. మాధవాచార్యులీపని చేయడానికి బౌద్ధ దృక్పధం బాసటగా నిలిచింది.
అనుమానాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే దినసరి జీవితంలో చాలా అసాధ్యాలను ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనుడనే తార్కికుడన్నాడు. ఇదంతా మాధవాచార్య కృతకవ్యాఖ్య వల్ల వచ్చిన ప్రమాదం.
మతం ఊహాజనితంగాచెప్పే -స్వర్గం -నరకం -పుణ్యం- పాపం- ఆత్మ -దైవం -పూర్వజన్మ- పునర్జన్మ- లాంటి వాటిని అనుమాన ప్రమాణం ఆధారంగా చేసుకొని నమ్మరాదనీ, వాళ్ళ అనుమానం చెల్లదనీ లోకాయతులు చెప్పారు.అంతేగాని, ఇతర విషయాలలో గాదు. ఇంద్రియానుభవానికి దగ్గరగా ఉండేవాటి విషయంలో అనుమాన ప్రమాణాన్ని చార్వాకులు అంగీకరిస్తారు.
బుద్ధమోషుడు లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని విమర్శిస్తూ దీనిని వితండవాద శాత్త అంటే వితండవాద శాస్త్రం గా పేర్కొన్నాడు.
                              వితండ – వాద – అనేవి రెండు లక్షణాలు. ఒకటిగాదు.ఈరెండూ పరస్పర విరుద్ధ గుణాలు కలవి.
వితండ- విచ్చిన్నానికి దారితీసే, వాదం- నిర్మాణానికి పనికివస్తుంది.ఈ పరస్పర విరుద్ధ లక్షణాలను లోకాయతులకంటగట్టి బౌద్దుల లోకాయతాన్ని అపహాస్యం చేయడానికి పూనుకున్నారు. మాధవాచార్యుడు వీళ్ళనే అనుసరించాడు.
తర్కశాస్త్రంలో వితండ లక్షణం :
స ప్రతిపః స్థాపనాహీ వో వితండా అని చెప్పబడ్డది.
స్వపక్షమును స్థాపింపక, పరపక్షమును ఖండించుటయే ఫలము గల వార్తాలాపం వితండ అని చెప్పబడుతుంది.వాదలక్షణము ప్రమాణ తర్క సాధనో పాలంభః సిద్ధాంతా విరుద్ధః పంచాపయనోపపన్నః పక్ష ప్రతిపక్ష పరిగ్రహోవాదః ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారాను వానికి అనుకూలించు తర్కముల ద్వారాను తన పక్షమును సాధించుచు పరపక్షమును నిషేధించునట్టిదియు, సిద్ధాంతమును విరోధింపనట్టిదియు, ప్రతిజ్ఞ మొదలగు ఐదు అవయవములు గలిగినదియు, వాది ప్రతివాదులచే పక్ష ప్రతిపక్షములు కలదియు నగు చర్చా విశేషము వాదనమనబడును.
                               ఈ రెంటికీ ఒకే అర్ధం చెప్పి పనికిమాలిన కుతర్కంగా భావించి చెప్పారు. అయితే ఇది వాస్తవమా?
శుక్ర నీతిసారం అనే గ్రంథం నాస్తికుల్ని తార్కిక వివాదాల్లో ఆరితేరిన వాళ్ళుగా పేర్కొంది. మత భావాలను తూర్పారబట్టటంలో వీరి వాదనాపటిమ అజేయం. ఇది విధ్వంసక లక్షణం. అదే సమయంలో సిద్ధాంత స్థాపన విషయంలో నిర్మాణాత్మక వైఖరి వీళ్ళ తర్కంలో కనిపిస్తుంది. పునాది లేని , అర్ధ రహితమైన మతాచారాలను తమ తార్కిక శక్తితో తునాతునకలు చేసి వాటికి ప్రజల్లో స్థానం లేకుండా చేస్తున్నారనే కారణంతో లోకాయతాన్ని వైదిక మత ప్రచారకులూ, వాళ్ళతోపాటు సనాతన ధర్మానికి మారిపోయిన బౌద్ధ జైనులూ పనిగట్టుకొని ఈపని చేశారు.పశుశ్చే న్నిహత స్సర్గం
జ్యోతిష్టో మేగ మిష్యతి|
స్వపితా యజమానేన
తత్ర కస్మాన్న హస్యతే|| “జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలలో చంపబడ్డ జంతువుకు స్వర్గం వస్తుందని అంటారు. అయితే యజ్ఞకర్త తన తండ్రినే చంపితే తండ్రికే స్వర్గం ఇప్పించినవాడౌతాడుగదా! తండ్రిని ఎందుకు చంపడు?వృక్షాన్ భిత్వా పశూన్ హత్వా
కృత్వారుధిం కర్దమం |
ఇత్యేవం గమ్యతే స్వర్గం
నరకం కేన గమ్యతే ||
చెట్లను నరికి , జంతువులను చంపి రక్తపు మడుగులు గావించేవారంతా స్వర్గానికి వెళుతుంటే, నరకానికి ఎవరు వెళతారు?
గచ్చతావిహ జంతూనాం
వ్యర్ధం పాధేయ కల్పనం |
గేహస్థ కృత శ్రాద్ధేన
పధి తృప్తి రవారితా ||
మనం శ్రాద్ధం జరుపుతూ ఇంటిలో పెట్టిన ఆహారం పైలోకాల్లోని పితరులకు చేరుతుందని అంటారు. అయితే పనిమీద పొరుగూరు పోయిన మన కుటుంబ సభ్యులకు వేళ ప్రకారం ఇంటిలో అన్నం విస్తరిలో వడ్డిస్తే ఆకలి తీరుతుందా? ఈరకంగా చార్వాకులు మతాచారాలను తమ తార్కిక శక్తితో చాలా సరళంగా, నిశితంగా ఖండించి ప్రజల్లో దానికి స్థానం లేకుండా చేయడానికి ప్రయత్నించారు.
               హరిభద్రసూరి రాసిన షడ్దర్శన సముస్చయా నికి లఘు వ్యాఖ్య వ్రాసిన మణిబద్రుడు లోకాయతుల ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలియజేస్తూ ఇంద్రియానుభవానికి విరుద్ధమైనవాటికి ప్రాధాన్యం ఇస్తే ఎంత నష్టం వస్తుందో వివరించాడు.
దరిద్రోహి స్వర్గరాశిర్మే అస్తీత్య సుధ్యాయ హేలయై వాదౌః స్థ్యదలయేత్, దాసోపిస్వ చేతన స్వావితామవలంబ్య కిం కరతాం నిరాకుర్యాదితి…”
కనబడని వాటికి అస్తిత్వాన్ని అంగీకరిస్తే – దరిద్రుడు తాను బంగారు కుప్పపై కూర్చున్నట్టుగా భావించి తన పేదరికాన్ని అనాసక్తంగా చూసే ప్రమాదముంది.బానిస తాను యజమానినని బ్రమించే ప్రమాదం ఉంది.
లోకాయతులు హేతువునకు నిలబడనివాటిని ,కేవలం విశ్వాసం మీద ఆధారపడ్డవాటిని తిరస్కరించారు.
జ్ఞాన సంపాదనా విషయంలో అనుభవానికి గోచరంకానిదానిని వ్యతిరేకించారు. రెండు విభిన్న సంస్కృతుల మధ్య జరిగిన చర్యగా దీనిని మనం గమనించాలి.ఎవరెన్ని చెప్పినా లోకాయతులు ఈ దేశకు తొలి తార్కికులు . తమ తార్కిక శక్తితోటే విశ్వాసమే ఆధారంగావున్న అహేతువులైన మత సంప్రదాయాలను , ఆచారాలను బట్టబయలు గావించి ప్రజల్లో వాటికి స్థానం లేకుండా చేయడానికి యత్నం చేశారు.అందుకే వీళ్ళ ధాటికి తట్టుకోలేని మతప్రచారకులు గుంపులుగా చేరి వివిధ రకాల విమర్శనాస్త్రాలను గుప్పించారు. అయినా, ఏమీ చేయలేక పోయినారు.
లోకాయుతం – నీతినాస్తికులు – తిను,తాగు,సుఖం అనుభవించు- అప్పు చేసైనా సరే భోగాలనుభవించు అనే చవకబారు నీతిని చెప్పి ,జీవిత విధానాన్ని ఉన్నత విలువలనుంచి నీచ స్థితికి దిగజార్చారని ప్రచారం గావించారు. అంతా పనిగట్టుకొని ఈ సిద్ధాంత కర్తలపై దుమ్మెత్తిపోశారు.
సర్వ దర్శన సంగ్రహం రాసిన మాధవాచార్యులు ఋణం కృతా ఘృతంపి బేత్ అని కల్పించి చెప్పాడు.
షడ్దర్శన సముచ్చయకర్త హరిభద్రుడు కూడా-
పిబ ఖారచజాత శోభనే! యతీతం పరగాత్రి! తన్నతే
నహి భీరు! గతం నివర్తతే, సము యమమాత్రమిదం కళేబరం
ఇది ఉమ్రఖయ్యాం భావాలనే పోలివుంది.
ఓ జాత శోభనా! తిను, తాగు- గడచిన సమయం తిరిగి రాదు. అందుకే ఇప్పుడే అనుభవించు. ఇది చాలా పేలవమైన అభిప్రాయం. లోకాయత కేవలం ఇంద్రియ సుఖాలపై వెంపరలాడిన సిద్ధాంతం గా వక్రీకరించడానికి చేసిన యత్నం.
కృష్ణమిశ్రుడు కూడా ప్రబోధ చంద్రోదయ నాటకంలో చార్వాక పాత్ర ద్వారా లోకాయతుల నీతి ఏమిటో చెప్పిస్తాడు.
క్వా లింగనం భుజని పీడిత బాహు మూలం
భుగ్నోన్న తస్త న మనోహర మాయాతాక్ష్యాః|
భిక్షోపవాస నియమార్క మరీచి దాహైః
దేహోపశోషణ విధిః కుధియాం క్వచైషః||
పురుష బాహుమూలాలచే పీడనములైన మనోహరములైన స్త్రీ కుచాలింగనమెక్కడ? భిక్ష, ఉపవాస, పంచాగ్నులతో దేహం శుష్కింప చేయటం వంటి శారీరక కష్టముల ఆచారాలెక్కడ? ఇంద్రియ సుఖాన్ని పొందటమే పరమార్ధం.త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం
దుఃఖోప స్పష్టమితి మూర్ఖ విచార ణైషా|
వ్రీహీన్ జిహా సతి సిలోత్తమ తండులాడ్యాన్
కోనామ భోస్తు షకణోప హితాన్ హితార్ధీ||-ఇలాంటివే చాలా రకాలుగా అంటగట్టారు.
లొకాయతం ఇంత చవకబారు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేదైతే, ఇంది ప్రజల్లో వేళ్ళూనుకుని ఉండేదికాదు. అన్ని తరగతుల ప్రజల్ని ఆకర్షించేది కాదు.మనం కేవలం ప్రతిపక్షుల గ్రంధాలపైనా, వాళ్ళ విమర్శల పైనా ఆధారపడటం వల్ల లోకాయతనుగూర్చి సరైన విధంగా ఆలోచించలేము. భారతంలోనూ, హరివంశంలోనూ బ్రాహ్మణపండితులే లోకాయతను అధ్యయనం చేసినట్లు దాన్ని అధ్యయనం చేయడం సగర్వంగా ఒక గొప్ప అర్హతగా చెప్పుకున్నారు. ఇది పైవారు చెప్పినట్లుగా కేవలం ఇంద్రియసుఖ లంపటత్వంలో మునిగిందైతే ఇంత ప్రభావం చూపేదా? కాదని సులభంగానే చెప్పవచ్చు.
                 అయితే లోకాయుతుల నీతిని, జీవన విధానాన్ని ఎట్లా రచించాలి? దీనికి శత్రువులకు కూడా ఆశ్చర్యం గొలిపే వృత్తాంతం భారతం లోనే వుంది.
ఇంతకుముందు చెప్పిన భారతం లోని చార్వాకుడి వృత్తాంతం లోకాయత నీతికి నిదర్శనం గా వుంది.
ముందు భారతం లోని కథ చూద్దాం. (శాంతి పర్వం-ప్రథమాశ్వాసం).
” ….అట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుండను నొక్కరక్కసుండు విప్రాకారంబు
గైకొని త్రిదండి వేషం బలపడ నయ్యవనీ దేవతాకోటిలో నిల్చియున్న రాధమునకిట్లనియె-
చంప. వినుము నరేంద్ర! సర్వమును విప్రజనంబును గూడి నన్ను బం
చిన విధ మీతడేటి పని సేసిన పాపము పెద్ద చంపుచో|
జనకుడు బ్రాత పుత్రుడను శంక యొకించుక లేదు సద్గురుం
డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయు బుట్టదుగాని గాల్పనే?||
|| అనుమనిరని పలికి వెండియు
ఆ. ఇట్లు శిష్టజనము నేవగిపగడజేయు
రాజ్యమెల్ల బంధు రాజినెల్ల
బొలియజేసి యెట్టి భోగంబు లనుభవిం
చెదవు, కల్మషంబు చిక్కె నీకు.
||అనిన విని యవ్విప్రు లత్యంత వ్యధితాంతః కరణులగుచో నొండురుల మొగంబులు చూచి, ఇట్లు పుట్టంబనియేమియను వచనంబులతో నిరుగుడుపడిరి. ధర్మనందనుడు లజ్జావనతవదనుండై యూరకుండి వారలవలను కనుంగొని కేలుమొగిచి ఫాలభాగంబున గదియించి ఇట్లనియె-
తే. మ్రొక్కివేడెద నను మీరు ధిక్కరింప
కాదరింపుడు మునిసమోహానమతుడ |
నై వినిశ్చయ పరికి లతాంతరంగ
వర్తనముతోడ నిచటికి వచ్చినాడ ||
|| అనవుడు భయసంభ్రమ భరితములగుచు నా భూసురులు దేవా! ఈ వాక్యంబులు, మావలనం బుట్టినవికావిది యేమియోగాని నీ వుత్తమ క్షాత్రధర్మంబున సముపార్జించిన యుజ్జ్వలశ్రీ సుస్థిరతంబొందుమని యతనికి నా శ్వాసంబొనర్చి యమ్మాయభిక్షువు నాలోకించి పరమబోధంబున నప్పురుషాధము నెరింగి యమ్మహీపతితో – వీడు దుర్యోధన సఖుండగు రాక్షసుండు, సన్యాసి వేషంబున నేతెంచి యాతనికి హితంబాచరించువాడై ఈ దుర్వచనంబులాడె, నీకుక్క మొరిగిన, యంతన పాలమున్నీరుంబోని నీకు గలంగనేల ధర్మాత్ములగు తమ్ములు పమపుసేయం బూజ్యంబగు సామ్రాజ్యంబు వహింపుమని యాదరించి -
కం. ఆ రాక్షసు గనుకొని కో
పారంజిత నేత్రులగుచు నవ్విప్రులు హుం |
కార ముఖరలగుటయు నతి
ఘోరాకృతితోడ వాడు గూలెం బుడమిన్ ||
తే. బ్రహ్మతేజో నిహతినట్లు పడి మహాశ
ని ప్రహతి పాతితోర్విజ విబ్రాంతినొంది |
యన్న యద్దానవుని జూచి యన్నరేంద్రు
డెలిమి సొంపు వహించె దమ్ములున్ దాను ||
|| ఇట్లు ప్రీతుండై యజాతశత్రుం డవ్విప్రసమూహంబునకు సవిషేసార్చనంబొనర్చి వీడుగొలిపె నప్పుడచ్యుతుండు బ్రాహ్మణ స్తుతిచేసి యజ్ఞనపతితో నిట్లను గృతయుగంబునన్ జార్వాకుండను దైత్యుండు తపంబొనరించి పద్మభవుండు ప్రత్యక్షంబయిన నిఖిల భూతములవలనను నభయంబు వేడిన నద్దేవుడు భూదేవతల కనిష్టంబైన పనులు చేయకుండువాడవు చేసితేని యదియునీకు దుదియని పలికి యవ్వరంబొసంగెనట్లు లబ్దవరుండై వాడు గర్వించి గీర్వాణుల బాధింపందొడంగిన వారు విరించింగాంచి యారక్కసుండు సేయు బాధలంజెప్పిన యమ్మహాత్ముండేను మున్న యెరింగి యొనర్చిన నాడె, దుర్యోధనుండును రాజునకు నెచ్చెలియై యచ్చపలుండు తర్కార్యంబాచరింపజొచ్చి యమ్మహీసురులకు మనోవ్యధాకరంబగు కర్మంబుసేయు నప్పని కారణంబుగా వారలకోపంబునంగూలం గలవాడని పలికె. నద్దానవుండు నేడిటవచ్చి తన దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవాడని చెప్పి, యప్పీనుగుం వెడల వైపించి, యాభూపాలు నుద్దేశించి వెండియు -ఆ.మారుకొన్న వారి నీరు సేయము ప్రజ
నరసి మనుపు ధరణి సురుల బ్రోవు |
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ
వృత్తి మనపు వెంపు వెలయ నధిప ||కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు తన తమ్ములతో యుద్ధరంగం నుండి పట్టణానికి వస్తున్నాడు. పట్టణం బయట ధర్మరాజుకు స్వాగతం పలకటానికి బ్రాహ్మణ వర్గం పోగైవుంది. ధర్మరాజు వస్తున్నాడు.ఆ గుంపులోనుండి ఒక వ్యక్తి ,చార్వాకుడి పేరుతో వున్నవాడు, ముందుకు పోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఏమయ్యా! ఈ బ్రాహ్మణవర్గం నిన్ను శపించమని నన్ను పంపింది. తండ్రి, తాత, సోదరుడు, గురువు – అనే విచక్షణలేకుండా అందరినీ చంపావు. ఎంతోపాపం మూటగట్టుకున్నావు.బంధువులందరినీ చంపి నీవు పాలించేది దేన్ని? “
ఇది చార్వాక నీతి . ఇందులో మాధవాచార్యులుగాని, హరిభద్రసూరిగాని, కృష్ణమిశ్రుడుగాని చెప్పిన ఇంద్రియ సుఖలాలసత్వం ఎక్కడుంది?
చార్వాకుడి ఈ హఠాత్సంఘటనకు బ్రాహ్మణులంతా నివ్వెరపోయారు.నైతికంగా తప్పు చేసినందుకు ధర్మరాజు గాయపడి చావాలనుకున్నాడు.కాని కొంతసేపటికి పురోహితవర్గం తెలివి తెచ్చుకొని చార్వాకుణ్ణి తాము పంపలేదనీ, ఈతడు దుర్యోధనుని స్నేహితుడైన రాక్షసుడనీ, చెప్పి – ధర్మరాజుని పొగడి , చార్వాకుణ్ణి దహించివేశారు.
చార్వాకుడు రాక్షసుడనీ, దుర్యోధనుడి స్నేహితుడనీ చెప్పిన ఈ కథ కల్పితమని తెలుస్తూనేవుంది.ఇది చాల దుర్బుద్ధితో కూడుకున్న పని. అయితే ఇక్కడ ఓవిషయం గమనించాలి. చార్వాక – లోకాయత పదాలు పర్యాయపదాలు. చార్వాకుడికంటగట్టిన భావాలు లోకాయతకు గూడా వర్తిస్తాయి. ఇక్కడ ధర్మరాజు చేసిన పని – స్వీయ బంధువుల్ని, గురువుల్ని చంపడం – సామాన్య జన్నాన్ని గాదు. రక్తసంబంధీకుల్ని చంపడమనేది మానవుడి సాంఘీక నీతికి విరుద్ధం. అటవిక నీతికి భంగం కలిగించడం. మానవ సమాజ ప్రాథమిక విలువల్ని ధర్మరాజు మంటగలిపాదు. వాటిని ధ్వంసంచేయడం తప్పని చార్వాకుడు ఎదురు తిరిగాడు. ఇందులో నీతి వుందా, తప్పు వుందా? ఏ భావవాది దీన్ని దోషమంటాడో చెప్పమనండి. ఇదే విషయం గీతలో కృష్ణుడు – బంధువుల్ని చంపటానికి వెనకాముందూ ఆలోచిస్తున్న అర్జునుణ్ణి హింసకు పురికొల్పుతాడు.
హతోవా ప్రాప్యసే స్వర్గం -
జిత్వావా భోక్షసే రాజ్యం అంటాడు.
హింసకు ప్రేరేపించిన కృష్ణుడినీతి గొప్పదా? మానవ విలువల్ని కాలరాయటం తప్పని ధర్మరాజును నిలదీసిన లోకాయతుడిది తప్పా? ఏది ధర్మం, ఏదధర్మం? ఎవరు ఇంద్రియ సుఖలాలసత్వాన్ని బోధిస్తున్నారు? ఎవరు ఉన్నత జీవన విలువల్ని భగ్నం చేస్తున్నారు? మనం ఆలోచించాలి.లోకాయతం – తత్త్వశాస్త్రంలోకాయతం మనకు కనిపిస్తున్న ఈ లోకానికి సంబంధించిన తత్త్వశాస్త్రం. ఇది ఈ పదంలోనే కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజల దృక్పథం – అని లోకాయతకు అర్ధం చెప్పుకొనేటప్పుడు దీన్ని మనం వేరేవిధంగా అన్వయించలేం.
అంతేగాక, ఇతర తత్త్వశాఖలకు ఆయా వ్యక్తులకు కర్తలుగా వున్నారు. కానీ , ఇది ఒక వ్యక్తి ప్రచారం చేసిన తత్త్వశాస్త్రం గాదు. ప్రజల ఆలోచనల నుంచి బయలుదేరిన ప్రజాతత్వశాస్రము. ఈలోకానికి సంబంధించింది. కాబట్టి భౌతిక తత్వశాస్త్రంగానే ఘంటాపథంగానే చెప్పవచ్చు.ఇది ప్రజల చరిత్రతో విడదీయరాని సంబంధం వున్నశాస్రం.ప్రపంచ సృష్టిని గూర్చి లోకాయతులు ఏమంటారు ? ఇది ఏఅతీతశక్తుల వల్లనూ ఏర్పడింది కాదంటారు. భౌతిక పదార్ధాల పరిణామం వల్ల ఈ ఙగతి సృష్టి ఏర్పడిందనీ , దానిని ఏ భగవంతుడూ కారణం కాదని అంటారు.కామస్తనదగ్రే సమవర్త తాధిమనసోరేతః ప్రథమం యదాసీత్నతో బంధమనతి నిరనిందన్ హృదిప్రతీష్యాక వయో మనీషా
ఆంతరంగిక పరిణామం వల్లనే ఈ విశాల విశ్వం ఏర్పడింది. ప్రకృతి శక్తికి మొదట బీజం అట్లా ఏర్పడ్డదే. విజ్ఞానులు తమతమ విజ్ఞాన సంపత్తిచే, చేతనాచేతన విశ్వాన్ని విశ్లేషించారు.
ఇయం వి సృష్టిర్యత అబభూవ
య దివాదదే య దివాన
యో అస్వాధ్యక్షః పరమే
వ్యో మన్సఅగ వేదయదివా న వేద
విశ్వసృష్టి ఎక్కడనుండి వచ్చిందో ? ఇది సృష్దించబడ్డదా ? కాదా ? ఈ విషయాన్ని ఏదో స్వర్గలోకంలో వుండి పరిశీలించినవాడుగానీ, పరిశో్ధించినవాడుగాని, విచారించినవాడు గానీ ఎవడైనా వున్నాడా ? నాస్తికుల్ని దేహాత్మవాదులంటారు. అంటే వేదాంతులు చెప్పే ఆత్మ అనేది శరీరానికి భిన్నమైనది ఏదీ లేదని లోకాయతులు చెప్పారు. ఉపనిషత్తుల్లోనూ బ్రాహ్మణాల్లోనూ విభిన్న దేహవాదం అసురత్త్వంగా ప్రచారం చేసారు. అంటే లోకాయతుల దేహవాదం , అసురుల దేహవాదం , అభిన్నాలనే చెప్పాలి. తంత్రవాదుల దేహవాదం కూడా దీనితో అభిన్నంగానే కనిపిస్తుంది.ఆత్మ సిద్ధాంతం గురించి మైత్రాయణీ ఉపనిషత్తులో వుంది. ముందుగా దాన్ని తెలుసుకుందాం.దేవతలూ- రాక్షసులూ బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఇద్దరూ బ్రహ్మకు నమస్కారంచేసి – ఆత్మను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. దానిని గురించి చెబుతారా ? అని అడిగారు. ఆ మాటలు విన్న బ్రహ్మ కొంతకాలం ఆలోచించి తనలో తాను ఇట్లా అనుకున్నాడు. ఈ రాక్షసులు ఆత్మ కావాలని వచ్చారు. వీళ్ళకు ఆత్మను గురించి కాక దానికి వ్యతిరేకమైంది చెబుతాను అని అనుకొని అసురుల్ని పిలిచి వాళ్ళ వరకు ప్రత్యేకంగా  ఆత్మకు వ్యతిరేకమైంది చెప్పాడు. మూర్ఖులైన వాళ్ళు బ్రహ్మ చెప్పిన ఆత్మకువ్యతిరేకమైనదాన్నే  ఆత్మగా భావించి , దానిపై ఆధారపడి – ప్రయోజనకరము- శాశ్వితము- అయిన రక్షణను పోగొట్టుకొని అనేక ఇబ్బందులలో చిక్కుకొని జీవితాలను గడుపుతున్నారు. గారడీలోలాగానే – అసత్యమైనదాన్ని సత్యంగా భావించి ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో చెప్పిందే సత్యం, దాన్నేవిజ్ఞులైనవాళ్ళు ఆచరిస్తారు, దాని ఆధారంగానే జీవిస్తారు. బ్రాహ్మణుడైనవాడెవడూ అవైదికమైనదాన్ని చదువరాదు.     ఇదే కథ ఛాందోగ్యోపనిషత్తు  లో కొంచం వివరంగా వుంది.ఇందులో ఇంద్ర – విరోచనుల కథ చూడటం అవసరం. ప్రజాపతి – హృదయాంశంలో వుండే ఆత్మ , పాపరహితం-  చావు పుట్టుకలు – ముసలితనం – ఆకలిదప్పులు లేనిది. అది సత్యకామాలు- సత్య సంకల్పాలూ కలది. దానినే వెదకాలి. దానినే తెలుసుకోవాలి. దాన్ని ఎరిగినవాడు సర్వలోకాలూ -సర్వకామాలూ పొందుతాడు“  అని అన్నాడు.                   ప్రజాపతి ఈ మాటల్ని దేవతలూ , అసురులూ ఇద్దరూ  కర్ణాకర్ణిగా  విన్నారు. ఏ ఆత్మ జ్ఞానం వల్ల సమస్త లోకాలయొక్కయు , సర్వ కామాల యొక్కయు ప్రాప్తి కలుగుతుందో ఆ ఆత్మను తెలుసుకోవాలనీ వాళ్ళిద్దరూ మనసుల్లో కోరుకున్నారు.             దేవతల తరఫున ఇంద్రుడు- అసురుల తరఫున విరోచనుడు ఆత్మను తెలుసుకోవాలని బయలుదేరారు. చేతుల్లో దర్భలు ధరించి ఇద్దరూ వొకరికి తెలియకుండా ఒకరు ప్రజాపతి దగ్గరకు వచ్చారు. ఇంద్ర విరోచను లిద్దరూ  32 సం. ప్రజాపతి ఆశ్రమంలో బ్రహ్మచర్యంతో వున్నారు. ఒకనాడు ప్రజాపతి వాళ్ళని చూసి ఏం కోరి మీరీ ఆశ్రమంలో ఇంత కాలం ఉన్నారు ?” అని అడిగాడు.ఆ మాటలకు వాళ్ళు భగవాన్ ! ఆత్మ పాప రహితమైందనీ , జనన మరణాలు లేనిదని , ఆకలి దప్పులు లేనిదని , సత్యకామాలూ సత్యసంకల్పాలూ కలదనీ , అది తప్పనిసరిగా తెలుసుకోదగ్గదని , దాన్ని తెలుసుకున్నవాడు  సర్వలోకాలూ, సర్వకామాలూ పొందగలడనీ మీరు చెప్పినట్లుగావిని , ఆ ఆత్మను తెలుసుకోవాలని వచ్చాం.    అని సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం విన్న ప్రజాపతి ఈ కళ్ళకు కనబడే పురుషుడే ఆత్మ అది అమృతం, అభయం, బ్రహ్మం అయివుంది అని వాళ్ళతో చెప్పాడు. ప్రజాపతి ఈ మాటలు విన్న ఇంద్ర విరోచనులిద్దరూ భగవాన్! ఈ నీళ్ళలోనూ, ఈ అద్దంలోనూ కనబడే ఆత్మ ఏది ?  అని అడిగారు. దానికి ప్రజాపతి నీటిలోనూ , అద్దంలోనూ కనబడే ఆత్మా కళ్ళకు కనబడే ఆత్మ ఒక్కటే అని చెప్పాడు. ఇంకా  ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ తరవాత ఆత్మను గూర్చి మీకు తెలియని విషయాలను నన్నడగండి అని  ఇంద్రవిరోచనులకు ప్రజాపతి చెప్పాడు. వాళ్ళిద్దరూ ప్రజాపతి చెప్పినట్లే నీటి పాత్రలో తమ్ముతాము చూచుకొన్నారు. మీకేమి కనబడింది ? అని ప్రజాపతి ఇద్దర్నీ అడిగాడు. ఇద్దరూ భగవాన్! మాకు మా పూర్ణ రూపం కనబడుతుంది. రోమముల నుండి గోళ్ళ వరకు మా ప్రతిరూపం మా ఛాయ కనబడుతుంది అని సమాధానం చెప్పారు. ప్రజాపతి మళ్ళా వాళ్ళను చూచి మీరు బాగా అలంకరించుకొని , మంచి బట్టలు ధరించి బాగా శుద్ధి చేసుకొని , ఇంకోసారి నీటిపాత్రలో చూడండి అని అన్నాడు. ఇంద్ర విరోచనులిద్దరూ అట్లాగే చేశారు. మీరేమి చూస్తున్నారు ? ” అని ప్రజాపతి ఇద్దర్నీ ప్రశ్నించాడు. ఇద్దరూ - భగవాన్! మేమెట్లా అలంకరించుకొన్నామో , మంచి బట్టలు ధరించి వున్నామో , శుద్ధి చేసుకొని వున్నామో అట్లాగే మా ప్రతిబింబాలున్నాయి అని ప్రజాపతికి సమాధానం చెప్పారు.  ఆ సమాధానం విన్న ప్రజాపతి ఇదే ఆత్మ! అమృతం , అభయం, బ్రహ్మం అని వాళ్ళకు చెప్పాడు. ప్రజాపతి చెప్పిన ఆ మాటలు విని ఇద్దరూ శాంత హృదయులై వెళ్లిపోయారు.   ఇట్లా శాంతహృదయులై వెళుతున్న ఇంద్ర, విరోచనులను చూచి ప్రజాపతి వీళ్ళిద్దరూ ఆత్మను పొందకయే , తెలిసికొనకయే వెళుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవడు ఈ దేహమే ఆత్మ అదో ఉపనిషత్తుకు అనుయాయి అవుతాడో వాడు పరాజితుడవుతాడు  అని తనలో తాను అనుకున్నాడు. విరోచనుడు శాంతహృదయంతో రాక్షసుల్ని సమీపించి శరీరాన్ని ప్రకాశవంతంగా , సుందరంగా అలంకరించుకోవడంలోనే విరోచనుని చిత్తం మునిగిపోయింది. అతడు –“ ఈ దేహం ఆత్మ   - అని అసురులకు ఉపదేశించాడు.   ఈ దేహమే  ఆత్మ . దీనినే పూజించాలి; దీనికే సేవలు చేయాలి. ఇట్లా చేస్తే మనుష్యుడు ఈ లోకాన్నీ, పరలోకాన్నీ పొందుతాడు అని విరోచనుడు అసురులకు బోధించాడు.ఇక ఇంద్రుడు దేవతల దగ్గరికి పోక ముందే అతనికి భయం వేసింది. ప్రజాపతి ఉపదేశం వల్ల అతడాత్మయొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఇట్లా ఆలోచించాడు. నీటిలో కనబడ్డ నీడ  శరీరం బాగా అలంకరించుకొంటే అది కూడా అలంకరింపబడుతుంది. ..శరీరం నశిస్తే ప్రతిబింబం నశిస్తుంది. కాబట్టి ప్రతిబింబం ఆత్మ ఎట్లా అవుతుంది ? అని ఆలోచించి మరలా ప్రజాపతి వద్దకు పోయి అడిగాడు. ఇంద్రా! నీవు బాగా తెలుసుకున్నావు. ఆత్మను గురించి నేను నీకు మరలా ఉపదేశిస్తా ! నీవు ఇంకా 32 సం|| లు బ్రహ్మచర్యంతో నా ఆశ్రమంలో వుండాలి  అన్నాడు. ఇంద్రుడు సరే నన్నాడు. ప్రజాపతి ఇంద్రుడికి వివిధ మార్గాల ద్వారా ఆత్మను గురించి చెప్పినట్లు తక్కిన భాగమంతా సాగింది.దీన్నిబట్టి చూసినా అత్మ అనేది ప్రత్యేకంగా శరీరానికి భిన్నంగా వుందని లోకాయతులు చెప్తున్నట్లు లేదు. అసురవాదంగా చెప్పేదంతా లోకాయత సిద్ధాంతమే.

—–భౌతికవాద, చార్వాక, లోకాయత తత్త్వశాస్త్ర ప్రచారకునిగా వుంటూ ది.18-4-2007న మరణించిన  ప్రముఖ భౌతికవాది, నాస్తికోద్యమ నాయకుడు  బి.రామకృష్ణ గారు రచించిన చార్వాకం గ్రంథం నుండి.ఉపాధ్యాయ సౌజన్యంతో.  

పరస్పర విరుద్ధ తత్వ శాస్త్రాలు

06/05/2007
దోపిడీ తత్వ శాస్త్రం
దీనికి మరో పేరు ‘ అసత్యం ‘
మార్క్సిష్టు తత్వ శాస్త్రం దీనికి మరో పేరు ‘ సత్యం ‘
1) సమాజంలో పూర్వం నుంచీ
రెండు రకాల వాళ్ళు ఉన్నారు.
సోమరులూ, పొదుపరులూ!
సోమరులేమో పేదలయ్యారు.
పొదుపరులు ధనికులయ్యారు.
సమాజంలో రెండు రకాల వాళ్ళు
ఉన్నారనేది నిజమే.కానీ వాళ్ళు
సోమరులూ, పొదుపరులూ కాదు.
దోపిడీదారులూ, శ్రామికులూ!
శ్రామికులే పేదలయ్యారు.
దోపిడీదారులు ధనికులయ్యారు.
2) స్వంతాస్తిని కూడబెట్టుకునే హక్కు
ఎవరికైనా వుంటుంది. ఎవరికి ‘ శక్తి ‘
ఉంటే వాళ్ళు కూడబెట్టుకోవచ్చు.
‘శక్తి ‘ అంటే ,’ ఉత్పత్తి సాధనాల ‘మీద
దౌర్జన్యంగా సంపాదించిన యాజమాన్యమే.
‘స్వంత శ్రమ ‘తో ఏర్పడే ఆస్తి, జీవితావసరాల్ని
తీర్చడానికి మాత్రమే సరిపోతుంది.
ఆ స్థాయిని మించిన ఆస్తికూడితే అది దోపిడీ
ద్వారానే సాధ్యం. దీన్ని కవితాత్మకంగా చెప్తే
‘ఆస్తి చౌర్యమే‘! ‘ఆస్తి ‘ అంటే స్వయంగా శ్రమించే
వాళ్ళ ఆస్తీ, దోచుకొనేవాళ్ళ ఆస్తీ ఒకటికాదు.
” రాజకీయ ఆర్ధిక శాస్త్రం చాలా భిన్నమైన
వేరు వేరు రకాల ఆస్తుల్ని గందరగోళపరుస్తుంది.
వాటిలో ఒకటి- ఉత్పత్తిదారుల స్వంత శ్రమ మీద
ఆధార పడినది. రెండవది- ఇతరుల శ్రమని
నియమించడం మీద ఆధారపడినది” -మార్క్స్
3) వ్యక్తిగత ఆస్తి లేకపోతే
పనిచెయ్యాలనే ఉత్సాహం
ఉండదు.
బానిసలు పని చేసిందంతా వాళ్ళ వ్యక్తిగత
ఆస్తి మీదేనా? ఈనాడు కార్మికులు పని
చేస్తున్నది తమ వ్యక్తిగత ఆస్తులమీదేనా?
స్వంత ఆస్తులు లేకుండానే వాళ్ళు ఎందుకు
పని చేస్తున్నారు? యజమానుల ఆస్తులన్నీ
స్వంత ఆస్తులే కదా? పని చెయ్యటానికి
యజమానులకు ఎందుకు ఉత్సాహం ఉండటం
లేదు? వాళ్ళ ఆస్తే వాళ్ళకు ఎందుకు
ఉత్సాహం ఇవ్వటం లేదు?
4) రాజ్యాంగ యంత్రం
శాంతి భద్రతలు
కాపాడుతుంది.
శతృవులనుంచి
రక్షిస్తుంది.
నిజమే. దోపిదీ వర్గ రాజ్యాంగ యంత్రం ,
దోపిదీ వర్గ శాంతి భద్రతలు కాపాడుతుంది.
దోపిడీ వర్గాన్ని శతృవులనుంచి, అంటే
శ్రామిక వర్గం నుంచి రక్షిస్తుంది. కాబట్టి
రాజ్యంగ యంత్రం రెండు వర్గాల కోసం పని
చెయ్యదు.
5) గత సమాజం మాట
వేరుగానీ, ఇప్పుడు మాత్రం
పెట్టుబడిదారులూ,కార్మికులూ
సమానమే.
కాదు. ఈ సమాజం కూడా గత సమాజాల మారు
రూపమే. ఈ సంబంధం కూడా దోపిడీ సంబంధమే.
యజమానీ సేవకుల సంబంధమే. ఇది కూడా
తప్పుడు సామాజిక సంబంధమే.
(ఫాల్టీ సోషల్ రెలేషన్)
6) స్వార్ధం అనేది
మానవ
స్వభావం
లోనే
వుంది.
మొదట మానవులందర్నీ ఏకం చేసి మాట్లాడడం
తప్పు. మానవులు- వర్గ మానవులే.బానిసకి
స్వార్ధం ఏమిటి? శ్రామికులకు ఉన్న స్వార్ధం
ఏమిటి? తమ శ్రమలో అత్యధిక భాగాన్ని
ఉచితంగా ధారపోస్తూ, యజమాని వర్గానికి,
రాత్రింబవళ్ళూ సేవలు చేయడమేనా?
‘స్వార్ధం ‘ అంతా యజమాని వర్గానిదే.
మానవులందరిదీ కాదు.
7) మానవులు
సహజంగానే
చెడ్డ వారు.
నేరాలు
చేస్తారు.
నేరాలకీ, చెడ్డతనానికీ మూలం దోపిడీయే.
దోపిడీయే పెద్ద నేరం. దాని ఆర్ధిక రాజకీయ
ప్రయోజనాలకోసమే నేరాలన్నీ పుట్టుకొచ్చాయి.
నేరస్తులంతా దోపిడీవర్గం వల్ల తయారైన
వాళ్ళే. శ్రామిక వర్గం చేసే నేరాల్లో కొన్ని
బ్రతుకుదెరువు కోసమూ,కొన్ని దోపిడీవర్గ
ప్రభావం వల్లా జరుగుతాయి. మనుషులు
పుట్టినప్పుడు మంచివాళ్ళూ కారు. చెడ్డవాళ్ళూ
కారు. సమాజమే వాళ్ళని మంచిగానో, చెడ్డగానో
తయారు చేస్తుంది. సమాజంలో నేరాలూ, చెడ్డ
తనమూ ఉన్నాయంటే, ఆ సమాజం బ్రహ్మాండమైన
తప్పులో వుందన్నమాట. దోపిడీ సమాజమే
శాశ్వితంగా కనబడే వాళ్ళకి, దాని లక్షణాలన్నీ
శాశ్విత లక్షణాలుగానే కనబడతాయి. నేరాలు
చెయ్యటమూ, చెడ్డతనమూ మనుషుల శాశ్విత సహజ
లక్షణాలలాగే కనబడతాయి.
8 ) జాతీయ ఆదాయంలో
న్యాయమైన
పంపిణీ
జరగాలి.
శ్రామిక వర్గం నుంచి అదనపు విలువనీ ‘లాగే ‘
విధానం అలాగే వుండాలి. కౌళ్ళూ, వడ్డీలూ,
లాభాలూ అన్నీ అలాగే వుండాలి. కానీ
జాతీయాదాయంలో ‘న్యాయమైన పంపిణీ ‘
‘ న్యాయమైన ‘
9) రాజకీయాల్నిబట్టే
ఆర్ధిక విషయాలూ
వుంటాయి.
కాదు. రాజకీయాలకి ఏదో ఒక ‘లక్ష్యం ‘
వుంటుంది. ఆర్ధిక పునాదిని నిలబెట్టడమో,
నిర్మూలించడమో. ఆ లక్ష్యం కోసమే
రాజకీయాలు అవసరం. కాబట్టి, ఆర్ధిక
విషయాల్నిబట్టి రాజకీయాలు; అంతేగాని
రాజకీయాల్ని బట్టి ఆర్ధిక విషయాలు కావు.
10 ) పేదలకి ‘ న్యాయం ‘
జరగాలి !
పేదలకి
‘ సేవ ‘
చెయ్యాలి !
పేదలే ‘ అన్యాయం ‘! అన్యాయానికి న్యాయం అంటే,
అన్యాయాన్ని అలా ఉంచటమే. అంటే ,పేదల్ని అలాగే
ఉంచి ,వారికి ‘న్యాయం ‘ చేస్తారన్నమాట !
పేదల సేవల్లో ప్రభుత్వాలూ, పేదల సేవల్లో
క్లబ్బులూ, పేదల సేవల్లో స్వచ్చంద సంస్థలూ !
అందరూ పేదల సేవ చేసే వాళ్ళే! పేదల్ని
సృష్టించేదే వీళ్ళు! ‘పేదతనం ఎందుకువుంది ‘
అనే ప్రశ్న మాత్రం వీళ్ళకి పట్టదు. తర తరాల
నుంచి పేదలే మీకు సేవ చేస్తున్నారు.భవిష్యత్తులో
పేదలు మీకు ఇంకా ఘనమైన సేవ చేస్తారు.
మిమ్మల్ని యజమాని పీఠాలమీద నించీ లాగి,
నిజమైన మనుషులుగా మార్చే సేవ పేదలే
మీకు చేస్తారు.
11 ) మానవ
జీవితాన్ని
‘ఆర్ధిక
పరిధి ‘లో
ఇమడ్చకూడదు.
అవును. మార్క్సిజం చెప్పేది కూడా అదే. ‘మానవ
సంబంధాల్ని డబ్బు సంబంధాలుగా వుంచ
కూడదు ‘ అనే. దానికోసం మార్క్సిజానికి ఒక
సిద్ధాంతమూ ,ఒక కార్యక్రమమూ కూడా
వున్నాయి.కానీ మీ దగ్గర అవేమీ లేవు.
మీ దగ్గర వున్నదంతా ‘డబ్బుతో డబ్బుని
పెంచుతూపోయే ‘కార్యక్రమమే. పైగా జీవితాల్ని
డబ్బు పరిధిలో ఇమడ్చకూడదు అనే చిలక
పలుకులూ, దొంగ నీతులూ! మీ ప్రకారం
డబ్బు శాశ్వితం! డబ్బు దోపిడీ శాశ్వితం!
డబ్బు సంబంధాలు శాశ్వితం! కానీ,
‘డబ్బు ‘ని నిజంగా తిరస్కరించే సిద్ధాంతం మాదే.
మార్క్సిజమే !
12) మానవుల స్వేచ్చమీద
నిషేధం వుండరాదు
మానవులు రెండురకాలు. ‘ స్వేచ్చ ‘ కూడా రెందు
రకాలు.దోపిడీదారులు దోపిడీ చెయ్యడానికి
స్వేచ్చ కావాలంటారు.స్వేచ్చకి అది వాళ్ళ
అర్ధం. కానీ, శ్రామికులు దోపిడీ చేసే స్వేచ్చ
ఎవరికీ వుండరాదని అంటారు. ఆ స్వేచ్చ తమకి
కూడా వుండరాదంటారు. స్వేచ్చకి వీళ్ళ
అర్ధం ఇదీ. కాబట్టి స్వేచ్చ కూడా వర్గ
స్వభావం కలదే.దోపిదీ అనేటంత పెద్ద విషయం
అయినా, ‘గోళ్ళని పెంచడం ‘అనేంత చిన్న విషయం
అయినా ఎవరి స్వేచ్చ వాళ్ళదికాదు. సమాజంలో
ఇతర మనుషులతో కలసి జీవిస్తున్నప్పుడు
సమాజానికి ఏరకంగానూ హాని కలిగించని
విధంగా , స్వేచ్చ పరిమితమై వుండాలి.
‘నా గోళ్ళు నాయిష్టం ‘ అని ఒక మనిషి
బారెడు బారెడు గోళ్ళని పెంచి తిరుగుతూవుంటే.
ఆ మనిషిని పట్టుకొని ఆగోళ్ళని కత్తిరించి
వెయ్యడానికి అందరికీ స్వేచ్చ వుంటుంది.అది
సమాజ ఆరోగ్య రక్షణకి ఆత్మరక్షణకీ
అవసరం.అదీ స్వేచ్చకి అర్ధం
13) నిమ్నవర్గాలు ఇప్పుడు
మారిపోతున్నాయి.
ఫలానా దేశములో
ఫలానా నిమ్నవర్గ
వ్యక్తిని తీసుకోండి.
ఉదా|| భారత దేశంలో
అంబేద్కర్ ని తీసుకోండి.
ఆయన ఎంత
అభివృద్ధి చెందాడు!
ఒక వ్యక్తి అభివృద్ధే మొత్తం వర్గ అభివృద్ధి
కాదు; అంతేగాక, అంబేద్కర్ అభివృద్ధి ఆ వ్యక్తి
నిజమైన అభివృద్ధి కాదు.శ్రామిక వర్గం
వాడైన అంబేద్కర్ మార్క్సిజం గురించి తెలిసి
కూడా అది పనికిరాదని తన రచనల్లో
ప్రకటించడంవల్ల శ్రామిక వర్గానికి గాక
పెట్టుబడిదారీ వర్గానికే మేలు జరిగింది.
” పాలకవర్గం పాలిత వర్గపు మేధావుల్ని
ఎంత ఎక్కువగానైతే తనలో ఇముడ్చుకుంటుందో ,
అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ
దాని పాలన తయారవుతుంది ” -మార్క్స్
(కాపిటల్ -3,పేజీ -601)
14) ఆస్తులకు పెట్టుబడిదారులు
ధర్మకర్తలుగా (ట్రష్టీలుగా)
ఉంటారు. కార్మికులు దేశభక్తులుగా కష్టించి పని చేస్తారు.(భారత దేశపు ఆధునిక తత్వవేత్త అయిన
మహాత్మాగాంధీ గారి ట్రష్టీ
షిప్పు సిద్ధాంతం. “షోషలిజం
ఆఫ్ మై కన్ సెప్షన్ ” -అనే
పుస్తక సారాంశం)
ఏం? ఆస్తులకు కార్మికులే
ధర్మకర్తలుగా వుండి,
పెట్టుబడిదారులే
కష్టించి పనిచేసే
దేశభక్తులుగా
ఎందుకు వుండకూడదు?
15)”మళ్ళీ జన్మ అంటూవుంటే
పాకీ వాడిగా పుడతాను “-
మహాత్మా గాంధీగారు.
మళ్ళీ జన్మదాకా ఎందుకూ? చెయ్యదలచుకున్న
సత్కార్యాన్ని మళ్ళీజన్మదాకా వాయిదావేసి
ఈ జన్మని వృధాచెయ్యడమెందుకూ? ఆ కార్యం
ఈ జన్మలోనే ఎందుకు ప్రారంభించకూడదూ?
16)’ షోషలిజంలో రాజు, రైతూ – ధనికుడూ, పేదా, యజమానీ-ఉద్యోగీ -అందరూ సమాన
స్థాయిలో వుంటారు” భారత తత్వవేత్త
మహాత్మా గాంధీగారు. (షోషలిజం
అఫ్ మై కన్ సెప్షన్ పేజీ-1)
గాంధీగారి ‘సోషలిజం ‘లో -ఒకవేపు రాజులూ,
ధనికులూ,యజమానులూ; ఇంకోవైపు రైతులూ,
పేదలూ,శ్రామికులూ- అందరూ ఎప్పటిలాగే
వుంటారు. కానీ అందరూ సమాన స్థాయిలో
వుంటారు! ఈ ‘సమాన స్థాయి ‘ ఏవిషయంలో?
ఏమో దాన్ని వారు వివరించలేదు.సమాన స్థాయీ,
సోషలిజమూ అనే మాటల్ని మాత్రం గాంధీగారు
కూడా తన తత్వశాస్త్రంలోకి చేర్చుకోక తప్పలేదు.
17) ‘భూస్వాములు
తమ మిగులు భూమిని
పేదవర్గాల కోసం
దానం చెయ్యాలి ‘
భూదానోద్యమ తత్వవేత్త
అయిన వినోబాభావే.
‘ మిగులు ‘భూమి! ‘మిగులు ‘ అంటే? భూస్వాములు
తమకు ఇష్టమైనంత తీసుకోగా ,దాచుకోగా,
ఆ పైది ఎంతోకొంత! భూస్వామి, తనకోసం
తీసుకున్న భూమిని భూస్వామి కుటుంబమే
స్వంత శ్రమతో పండించుకుంటుందా? దాన్ని కూడా
వ్యవసాయ కార్మికులే పండిస్తే ,జీతాలూ,
అదనపువిలువా అంతా ఎప్పటిలాగే. ఈ సమస్యని కూడా
భూదానొద్యమం ఎలపెరిష్కరిస్తుంది?
18) సమాజం నాకేమిచ్చిందని
కాదు. సమాజానికి
నేనేమిచ్చానని చూడాలి.
ఎప్పుడూ ‘ వ్యక్తి ‘నుంచీ లాగడమే చేసే సమాజం ఇలాంటి సూక్తులే చెపుతుంది. ‘ తీసుకోవడం ‘ ఉన్న ప్రతీ చోటా ‘ ఇవ్వడం ‘ కూడా వుండాలి. ‘ సమాజానికి నేనే మిచ్చాను ‘ అని ప్రశ్నించుకునే వ్యక్తికి , ‘ సమాజం నాకేమిచ్చింది ‘ అని ప్రశ్నించడానికి కూడా హక్కు వుంటుంది. ఎప్పుడూ తీసుకోవడమేగాని ఇవ్వడం చెయ్యని సమాజం వ్యక్తులకు ఏ మేలూ చెయ్యదు.వ్యక్తి, సమాజం కోసం అయితే, సమాజం వ్యక్తి కోసం కూడా! వ్యక్తికి , సమాజానికి వైరుధ్యం వుండరాదు. రెండూ వేరు వేరు కాదు. రెండింటి శ్రేయస్సూ ఒక్కటే.
19) మత గ్రంధాలన్నీ
సర్వజనుల సుఖాన్నే
చెప్పాయి.’గీత ‘లో
చూడండి,’బైబుల్ ‘లో
చదవండి.’ఖురాన్ ‘ లో
పరికించండి. ‘సర్వే
జనా సుఖినో భవంతు ‘
అన్నారు మన పెద్దలు.
అన్నారు సరే! ఇప్పుడు సర్వజనమూ సుఖంగా
ఎందుకులేరో, కొంతమంది జనం దుఃఖంగా ఎందుకు
వున్నారో ఏం కారణం చెప్పాయి మత గ్రంధాలన్నీ?
‘దోపిడీ’ని చెప్పాయా ? సర్వజనమూ సుఖంగా
వుండేవిధంగా సమాజాన్ని మార్చడానికి
మార్గం చెప్పాయా? ‘వర్గ పోరాటం ‘చెప్పాయా?
దేవాలయాల్లోనూ,చర్చీల్లోనూ,మసీదుల్లోనూ
నిరర్ధకంగా మోకరిల్లడం తప్ప, నిజజీవితాల్ని
మార్చగలిగే ఒక్క జ్ఞానవంతమైన మాట చెప్పాయా?
‘సర్వేజనా సుఖినోభవంతు ‘అనగానే ‘సుఖినో
భవంతు ‘ అవుతుందా? ‘మంత్రాలకు చింతకాయలు
రాలవనే ‘ మామూలు సంగతి కూడా మత
గ్రంధాలకి తెలియదు కదా?
20) వర్గపోరాటం హింస. ఆమాట అనేముందు దోపిడీవర్గం తన సమస్త
ఆయుధాల్నీ త్యజించాలి.తన పోలీసునీ,
కోర్టుల్నీ, జైళ్ళనీ,సైన్యాన్నీ అన్నిటినీ
రద్దు చెయ్యాలి. సమస్త ఆయుధాల్నీ పెట్టుకు
కూర్చున్నదీ దోపిడీ వర్గమే.యుగయుగాలుగా
వూహాతీతమైనంత హింస చేస్తున్నది దోపిడీ
వర్గమే.శ్రామిక వర్గాన్ని అణచడానికి
చేసేదే హింస.ఆహింసనుంచి బయటపడటానికి
ఎదురుతిరగడం హింస కాదు.అది ఆత్మరక్షణ
కోసం పోరాటం.విముక్తిచెందడం శ్రామిక వర్గం
హక్కు.ఆహక్కుని గ్రహించి దోపిడీ వర్గం స్వచ్చందం
గానే, తన దోపిడీని వదులుకుంటే , ఫోరాటమూ
వుండదు, హింసా వుండదు. హింసకి కారణం
మొదటినుంచీ దోపిడీ వర్గమే.
21)” యజమానులు
మేనేజిమెంటు పనిని
కూడా మానుకుంటే
‘తత్వ శాస్త్రం ‘
చదువుకోవచ్చు”.
-అరిస్టాటిల్
మరి, పనివాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి తత్వశాస్త్రం?
యజమానులు కూడా పనివాళ్ళతోపాటే పనిలోకి దిగితే
అప్పుడు అందరికీ పనికాలం తగ్గుతుంది.అప్పుడు అందరూ
తత్వశాస్త్రం చదువుకోవచ్చు.

-మార్క్స్ కాపిటల్-5వ భాగం నుండి.
పరిచయం:శ్రీమతి .రంగనాయకమ్మ

6000 స్కూళ్ళు మూత

16/04/2007

రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది.    అంటూ చాలామంది ఎంతో బాధపడుతూ పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.

   ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఈగ చూపు తో సమాజాన్ని చూస్తున్నాయి.అంటే ఎక్కడ తప్పులాగా కనిపిస్తుందా అని చూస్తున్నాయి. ఇక్కడ 6000 స్కూళ్ళు మూతబడుతుండడమే చూసారుగాని 6 లక్షల ప్రైవేటు స్కూళ్ళు ఏర్పడిన విషయం విస్మరించారు. మీకు అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది చూడండి. నేటి బూర్జువా సమాజమును మోస్తున్న ఐరావతాల్లో ఒకదానిపేరు అవినీతి.మీరు బాగా చూస్తే అది ఒక్క డిపెప్పులోనేగాదు సర్వత్రా మీకు దర్శనమిస్తుంది.ఆ అవినీతి సొమ్ముకు ఆసెపడే మన ప్రబుత్వ సారధులు విద్యను ప్రైవేటు పరం చేస్తూ ‘విద్యా వ్యాపార సంస్థలను ‘ నిర్వహించుకొనుటకు అనుమ తించారు;తిస్తున్నారు;తిస్తారు. చూడండి తగిన వసతులు,బోధకులు లేకున్నా అనేక కళాశాలలకు అనుమతులొస్తున్నవిషయం తమకు తెలియందికాదు. మీరు/మనం మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదు.ఎందుకని?  ఒకటి రెండు ఉదాహరణలు చూదాం. మనకు బి.ఎస్.ఎన్.ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలప్రకారం ప్రైవేటు సెల్లు కంపెనీల లాభాలు తగ్గకుండా ఎంత చక్కగా వ్యాపారం నిర్వహిస్తుందో మీకు తెలుసు ,మనకు అనారొగ్యం సంప్రాప్తిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొవాలి అనే ఆలోచనే మనకు కలుగనంత చక్కగా ప్రభుత్వము ప్రభుత్వ ఆరొగ్య కేందాలను నడుపుతున్న విషయం మీకు ఈ సందర్భంగా గుర్తుకొచ్చే అవకాశెముంది, మీరు హైదరాబాదు వంటి నగరాలకు వెళ్ళవలసిన పనివుంటే మీరు ప్రైవేటు బస్సుల ఆపరేటర్లవద్దకు  వెళ్ళే ముందు  ఆర్ టీ సీ కి ఫోను చేసి ఖాళీలు లేవనిపించుకున్న సంఘటన గుర్తుకొచ్చే ఉండాలి ఎందుకంటే మన(?) ప్రభుత్వం ప్రైవేటు రవాణా రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది.

            కనుక ప్రభుత్వం ప్రజాసేవ తానుచేయకుండా ప్రైవేటు వ్యక్తులచేత ప్రజాషేవ చేయించుటకు ప్రయత్నిస్తున్నవిషయం మనకు అర్ధమౌతుంది. ఒకవేళ ప్రభుత్వం తానే ప్రజా సేవ చేస్తే – మన పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతారు,మనం ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యం పొందుతాం,ఆర్ టీ సీ లో ప్రయాణం చేస్తాం,చౌక ధరల దుకాణంలో సరుకులు కొనుక్కుంటాం. అంటే మన జేబునిండా డబ్బులుంటాయి. మరి ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందీ అంటే ఏమనాలి? మనల్ని జేబులుగొట్టేవాళ్ళకి అప్పగించిందిగాక ప్రభుత్వ నిర్ణయాల వలన ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం , ప్రైవేటు సంస్తల ప్రజా సేవకులూ కలసి ఆ తప్పును ప్రభుత్వ ఉద్యోగులమీదికి తోస్తున్నారు ఎందుకని?      

              సరే ఇక పాఠశాలల విషయానికొస్తే ఈ సమస్య (పిల్లలు లేకుండా పాఠశాలలు నడపాల్సిరావడం )కేవలం పట్టణాలకు, పరిసర గ్రామాలకు ఉంది.పట్టణాలలో ప్రయివేటు విద్యాదాతలు కులాలవారీగా, విద్యార్ధుల తల్లిదండ్రుల ఆర్ధిక స్థితులకు అనుగుణంగా విద్యా వ్యాపార సంస్థలు స్థాపించి ,ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలవడానికి ఎన్నిరకాల ఎత్తుగడలు (కులం,మతం,సారా,డబ్బు,ప్రలోభాలు) చేస్తుంటారో అలాగే ఈ విద్యా వ్యాపారం కూడా అన్నిరకాలుగా నిర్వహింపబడుతుంది.వారి సంస్తలో ఒక్కర్ని చేర్పిస్తే 5 శాతము బ్రోకరేజి, అందమైన ఆడపిల్లలకు ఫీజులో రాయితీ(ఆ అమ్మాయి కోసం చాలామంది అబ్బాయిలు చేరతారు), ఎక్కువమంది పిల్లల్ని చేరిస్తే టీచరు పొస్టు,  పల్లెటూరు నుంచి వచ్చి చేరేవారిని మరీ దారుణంగా మోసం చేస్తారు.పిల్లవాని స్థాయికి మించిన ప్రశ్నేలు అడిగి వారిని క్రింది తరగతిలో చేర్చుకుంటారు ,మరీ కొన్ని చోట్లనయితే ప్రతి తరగతికి 20 ప్రశ్నె జవాబులను నోట్సుగా చెప్పి దానిలోనే అన్ని పరీక్షలలో ప్రశ్నలు ఇచ్చి గొప్ప మార్కులు సంపాదిస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతారు,ఇక బొధన ఒట్టిమాటే, ఎదుటి సంస్తలో వేగుల్ని ఏర్పరచి ఆ సంస్థలు మూతబడేలా చెయ్యడం ఇలా  వాళ్ళను గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు.
              ఇక పెద్దగ్రామాలలో నాలుగు బడులుంటాయి.మాలబడి (ఎల్.ఈ./ఎస్.సీ.),   మాదిగబడి(ఏ.ఏ.),    సాయిబులబడి(ఉర్దూ),    ఊళ్ళోబడి(హెచ్.ఇ./హిందూ).   స్కూలుకు 20 మంది పిల్లల చొప్పున 80 మందికి అంటే స్కూలుకు ఇద్దరు చొప్పున 8 మంది అయ్యవార్లు.   మరి అయితే ఈ నాలుగు స్కూళ్ళు కలిపి ఒకస్కూలుగా చేస్తేమంచిది. ఏమంటారు?

నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను? ( -భగత్ సింగ్ )

16/04/2007

సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న.ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని , దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము కూడా కారణమని నా మితృలుకొందరు నాతోవున్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు.వీళ్ళు నామిత్రులని అనుకోవడం ఎంతవరకు సరైందో తెలియదు.ఈ సమస్య మాత్రం తీవ్రమైనదే.మానవ సహజమైన ఈ లక్షణాలకు నేను అతీతుణ్ణని గొప్పలు చెప్పుకోవడం లేదు.నేనూ మామూలు మనిషినే. అంతకుమించి మరేమీ కాదు. నేనేకాదు , ఎవరైనా అలా అనుకోలేదు.నా స్వభావంలో అహంకారం ఒక భాగం. ఈ బలహీనత నాలోనూ ఉంది.నా మిత్రులు నన్ను నియంత  అని పిలిచేవాళ్ళు. నా ముఖ్య స్నేహితుడు బి.కె.దత్ కూడా అలాగే పిలిచేవాడు. కొన్ని సందర్ధాలలో నిరంకుశుడని నన్ను నిందించడంకూడా జరిగేది.నా అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్ది ,నాసూచనల్ని ఆమోదింపచేసుకుంటానని కొందరు తీవ్రంగా ఆక్షేపించేవాళ్ళు.కొంతవరకైనా ఇది నిజమని నేనూ అంగీకరిస్తాను. ఇది అహంభావమేకావచ్చు.బాగా ప్రచారంలోవున్న ఇతర భావధోరణులకూ, నాభావధోరణికి ఘర్షణ జరిగినప్పుడు నాలో అహంకారం తొంగిచూస్తుంది.అయితే ఇది వ్యక్తిగతమైనది కాదు.నా ధృక్పధం పట్ల నాకున్న గట్టి నమ్మకమేగాని, గర్వం కాదు.ఒక వ్యక్తికి తానంటేఉన్న గర్వాతిశయాన్నే అహంకారం అంటాం. నన్ను నాస్తికుణ్ణి చేసింది ఈ అహంకారమేనా? లేక కొంతకాలంపాటు ఈవిషయం గూర్చి శ్రద్ధాశక్తులతో నేను చేసిన అధ్యయనమా? దీన్నిగురించి నేనిక్కడ చర్చిస్తాను.అహంభావానికి,గర్వానికీ తేదావుందన్నవిషయాన్ని మొదట స్పష్టం చెయ్యాలి.    

                                         దేవుణ్ణి నమ్మకపోవడానికి అనుచితమయిన గర్వంకానీ, మితిమీరిన అహంకారం కాని ఎలా కారణాలవుతాయో నాకర్ధం కావడంలేదు. సరైన యోగ్యతా ,అవసరమైన సుగుణాలు లేకుండానే కొంతయినా నేను ప్రజాభిమానం పొందిఉంటే , ఒక మహాపురుషుడి గొప్పదనాన్ని నిరాకరించగలను. ఆ మేరకది సాద్యమే.అయితే దేవుడిపైన నమ్మకం వున్నవాడు కేవలం తన గర్వం మూలంగా ఆ నమ్మకాన్ని ఎలాపోగొట్టుకోగలడు? ఇది రెండు రకాలుగా జరగవచ్చు – మానవుడు తాను డేవుడికి పోటీదారుణ్ణని భావించడం వల్లా, లేదా తానే దేవుణ్ణని అనుకోవడం వల్లా. ఈ రెండు సందర్భాలలోనూ అతడు నిఖార్సయిన నాస్తికుడు కాలేడు. దేవుడికి తాను పోటీదారుణ్ణీ అని భావించినప్పుడుగానీ ,లేక తానే దేవుణ్ణని ఆనుకున్నప్పుడుగానీ రెండు సందర్భాలలోనూ దేవుడి వునికిని వొప్పుకున్నట్టయింది. ఆ దేవుడు తానే అనుకొన్నా వేరే అనుకొన్నా ననకొక్కటే. ప్రధానమైనది ,అతని నమ్మకం. దానికిక్కడ స్థానం ఉంది. కాబట్టి ఏవిధంగా చూసినా అతడు నాస్తికుడుకాడు. మరి నా విషయానికొస్తే, పైరెండు ధోరణులకు చెందినవాణ్ణి కాను నేను. సర్వ శక్తి సంపన్నుడైన ఆ పరమ పురుషుడి ఉనికినే కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నానో తర్వాత చెబుతాను. నాస్తికవాద సిద్ధాంతాన్ని నేను అనుసరించానంటే గర్వం వల్ల మాత్రం కాదని ముందిక్కడ స్పష్టం చెయ్యాలి.నేనే ఆ పరమ పురుషుణ్ణి కాను.అతగాడి అవతారాన్ని కాను.పోటీదారుణ్ణి అంతకంటేకాను. ఇలాంటి భావధోరణికినన్ను మరల్చింది గర్వం మాత్రం కాదనేది పచ్చినిజం. నాపై ఉన్న ఈ ఆరోపణ నిజంకాదని నిరూపించేందుకు ఇంకా కొన్ని వాస్తవ విషయాల్ని పరిశీలిద్దాం. ఢిల్లీ బంబు కేసులోనూ,లాహోర్ కుట్ర కేసులోనూ జరిగిన విచారణమూలంగా నాకు తగని ప్రజాభిమానం లభించి గర్వబోతునయ్యానని నా మిత్రుల అభిప్రాయం. వీరి ఊహల్లో నిజమెంతో చూద్దాం. నా నాస్తికవాదం ఇటీవల వచ్చిందేమీకాదు. ఏ పేరూ ప్రఖ్యాతీ లేని ఒకానొక యువకుడిగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్మడం మానేశాను. అప్పటికీ నేననేవాణ్ణి ఉన్నానన్న సంగతే ఈ మిత్రులికి తెలియదు.గర్వం వల్ల కనీసం కాలేజీ విధ్యార్ధి కూడా నాస్తికుడు కాలేడు. కొందరు ప్రొఫెసర్లకు నేనంటే ఇష్టమే.కొందరికి మాత్రం అయిష్టంగా ఉండేది.నాకు కష్టపడి చదివే అలవాటుండేదికాదు.అందువల్ల గర్వంలాంటి భావాలు కలిగే అవకాశమేలేదు. నా జీవితం భవితవ్యాన్ని గురించి నాకు నిరాశాపూరితమైన దృక్పధం ఉండేది.పైగా చాలా జంకు.ఆ రోజుల్లో నా నాస్తికత అంతంతమాత్రంగానే ఉందేది. మా తాతగారి పెంపకంలో పెరిగినందువల్ల ఆయన ప్రభావం నామీద వుండేది. ఆయన శుద్ధ ఆర్యసామాజికుడు. ఆర్యసామాజికుడు ఏమైనా కాగలడుగానీ ,నాస్తికుడు మాత్రం కాడు. నేను ప్రాధమిక విద్య పూర్తిచేసి లాహోరులో డి.ఏ.వి. స్కూల్లో చేరాను. ఒక ఏడాదంతా హాష్టల్లో చేరాను. అప్పట్లో ఉదయం సాయంత్రం ప్రార్ధనలుచేయటం అటుంచి గంటలకొద్దీ గాయత్రీ మంత్రం జపించేవాణ్ణి. అంటే నాలో అచ్చమైన భక్తి ఉందన్నమాట. ఆ తర్వాత మానాన్నగారి దగ్గర వుంటూవచ్చాను. మతాలకు సంబంధించి పూర్వాచార పరాయణత్వం విషయంలో మానాన్నగారిది విశాల దృక్పధం. ఆయన బోధల ద్వారానే స్వాతంత్ర్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేద్దామని నిర్ణయించుకున్నాను.అయితే ఆయన నాస్తికుడేమీ కాడు. చాలా గట్టి ఆస్తికుడు. రోజూ నన్ను కూడా ప్రార్ధనలు చేయమనేవాడు. నేనిలా పెరిగి పెద్దవాణ్ణయ్యాను.సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో జాతీయ కళాశాలలో చేరాను. కాస్త విశాలంగా ఆలోచిస్తూ మత సమస్యల్ని గురించి ,దేవుణ్ణి గురించి విమర్శనా దృస్టితో ఆలోచించడం మొదలు పెట్టింది అప్పుడే.అయినా అప్పటికి నేను భక్తిపరుణ్ణే. తలవెంట్రుకలు పెంచసాగాను. కొంతకాలానికి సిక్కుమతం,ఇంకా ఇతర మతాల పురాణాలపైనా, వాటి మూలసూత్రాలపైనా నమ్మకం పోయింది.అయినా దేవుడిపైన మాత్రం గట్టి నమ్మకం వుండేది.    
                                 ఆ తర్వాత విప్లవ పార్టీలో చేరాను. మొదట నాకు పరిచయమైన, ఆ పార్టీ నాయకుడికి డేవుడి విషయంలో గట్టి నమ్మకం లేకపోయినా,నిరాకరించగల సాహసం కూడాలోదు. దేవుణ్ణి గూర్చి ఆయన్ను గుచ్చి గుచ్చి అడిగేవాణ్ణి. ” నీ కిష్టమైనప్పుడు ప్రార్ధించు ” అనేవాడు. ఇదీ నాస్తిక వాదం కాదు. నాస్తిక వాదానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి.ఆ తర్వాత నాకు పరిచయమైన మరొక నాయకుడు గట్టి నాస్తికుడు.ఆ కామ్రెడ్ పేరు శచీంద్రనాథ్ సన్యాల్. ఇప్పుడాయన కరాచీ కుట్రకేసు మూలంగా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన ‘ బందీ జీవన్ ‘అనే పుస్తకం వ్రాసాడు. అది చాలా ప్రసిద్ధి పొందింది. మొదటి పేజీలోనే ఈశ్వర సంకీర్తనం కనిపిస్తుంది. వేదాంత మత ప్రభావమువల్ల భక్తిపారవశ్యంతో చేసే ఈశ్వర సంకీర్తనలు ఆయన ఆలోచనల్లో ప్రధాన భాగం. ఆపుస్తకం రెండోభాగం చివరి పేజీలో ఇది కనిపిస్తుంది. 1925 జనవరి 28న భారతదేశమంతటా పంచిపెట్టబడ్డ ” విప్లవ కరపత్రం “, ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం  ఆయన శ్రమ ఫలితమే.     

             వ్యక్తిగతంగా తనకిష్టమైన భావాలను రహస్యంగా ఉండిపోయిన తన గ్రంధంలో వ్యక్తపరిచాడు. ఇది తప్పదు. ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ,ఎన్ని విభేధాలున్నా, తన అభిప్రాయాన్ని అనుచరులు మన్నించవలసిందే. సదరు కరపత్రంలో ఒక పేరా మొత్తం సర్వేశ్వరుణ్ణి,అతని లీలల్ని కీర్తించడానికే కేటాయించడం జరిగింది. ఇదంతా భక్తిపారవశ్యం. ఇంతకూ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే- విప్లవ పార్టీలో నాస్తిక భావం అంకురించనైనా లేదని, కకోరీ అమర వీరులు నలుగురూ తమ అంతిమ దినాన్ని ప్రార్ధనలతోనే గడిపేశారు. రాంప్రసాద్ బిస్మల్ పూర్వాచార పరాయణుడైన ఆర్య సామాజికుడు. సోషలిజం, కమ్యూనిజాల గురించి ఎంతో అద్యయనం చేసినప్పటికి, రాజన్ లాహిరి ఉపనిషత్ సూక్తాలనూ, గీతా వచనాలనూ వల్లించాలనే కోరికను చంపుకోలేకపోయాడు. దైవత్వానికి కారణం మానవ దౌర్భల్యమో, విజ్ఞాన పరిమితో తప్ప మరొకటి కాదంటూ, ప్రార్ధనలే చేయని వ్యక్తిని ఆ నలుగురిలో ఒక్కర్నే చూశాను. అతను కూడా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అంతటి వాడికి కూడా దేవుడి ఊనికిని కాదనే ధైర్యం లేకపోయింది. 

                         అప్పటి వరకూ నేను ఒట్టి ఆదర్శవాద విప్లవకారుణ్ణి మాత్రమే. మేమంతా అనుచరులమే. మొత్తం బాధ్యతను భుజాన మొయ్యవలసిన సమయం ఇప్పుడొచ్చింది. అనివార్యమైన ప్రభుత్వ దమనకాండ వల్ల పార్టీ వునికే కొంతకాలం అసాధ్యమైపోయింది. ఉత్సాహవంతులైన కామ్రెడ్లు – వారు నాయకులు కూడా – మమ్మల్ని హేళన చేయసాగారు. మా కార్యక్రమం వ్యర్ధమౌతుందేమోనని, నేను కూడా ఏదో ఒక రోజున ఆశ వదులుకోవలసి వస్తుందేమోనని భయంగా వుండేది. నా అంతరంగంలో ” అధ్యయనం చెయ్ ” అనే పిలుపు మార్మోగసాగింది. వ్యతిరేకులు లేవదీస్తున్న వాదాల్ని ఎదుర్కొనే నేర్పు కలగాలంటే అధ్యయనం చెయ్యాలి. నా భావ ధోరణికి అనుకూలమైన వాదాలతో సాయుధుడిని కావాలంటే అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చెయ్యసాగాను. వెనకటి నమ్మకాలు, అభిప్రాయాలూ గణనీయమైన మార్పుకు లోనయ్యాయి. మా ముందు వారిలో దౌర్జన్య పద్ధతుల పట్ల ఉన్న ఆకర్షణ,ఆవేశం పోయి తీవ్రమైన భావాలేర్పడ్డాయి. పారవశ్యానికి, గుడ్డి నమ్మకాలకూ ఇక తావు లేదు. వాస్తవ వాదం మా భావధోరణి అయింది. ఎంతో అవసరమైతేనే బలప్రయోగం సమర్ధనీయం.     

                  ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసే అనివార్యమైన విధానం. కార్యాచరణ పద్ధతుల గురించి స్పష్టత ఏర్పడడం అన్నిటికంటే ముఖ్య విషయం. కార్యరంగంలో ముఖ్యమైన కార్యకలాపాలేవీ అప్పట్లో లేవు గాబట్టి, ప్రపంచ విప్లవానికి సంబంధించి వివిధ ఆదర్శాలను అధ్యయనం చేయడానికి మంచి అవకాశం లభించింది. అరాచక వాద నాయకుడైన బకునిన్ రచనలనూ, కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్సు రచనలు కొన్నీ, తమ దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసుకున్న లెనిన్, ట్రాట్ స్కీ మొదలైన వారి రచనలు చాలా భాగం చదివాను. వాళ్ళంతా నాస్తికులే. బకునిన్ పుస్తకం ” దేవుడూ-రాజ్యం ” అసంపూర్తిగా వున్నా, అందులో ఈ అంశం గురించి ఆసక్తికరమైన పరిశీలన కనిపిస్తుంది.
            ఆతర్వాత నిరాలంబ స్వామి ” కామన్ సెన్స్ ” అనే పుస్తకం నా కళ్ళబడింది. అందులో ఉన్నది నాస్తికవాదమే అయినా,  అది నాకు అయోమయంగా కనిపించింది. మొత్తం మీద ఈ విషయం నాకెంతో ఆసక్తి కలిగించ సాగింది. ఈ మహా విశ్వన్నంతా సృష్టించి,  శాసించే ఒక పరమాత్మ ఉన్నాడన్న ఆస్తిక సిద్ధాంతం పరమ నిరాధారమయిందని 1926 నాటికి నాకు గట్టి అభిప్రాయం ఏర్పడింది. దేవుడిపైన నాకున్న ఈ అవిశ్వాసాన్ని నలుగురికీ తెలియజేసాను. ఈ విషయమై మితృలతో చర్చలక్కూడా దిగాను. ఖచ్చితమైన నాస్తికుణ్ణయ్యాను. దీని అర్ధం ఏమిటో ఇప్పుడు వివరిస్తాను.       1927 మేలో నేను లాహోర్ లో అరెస్టయ్యాను. ఆ అరెష్టు హఠాత్తుగా జరిగింది. పోలీసులు నన్ను వెంటాడుతున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. ఒక తోటలో పోతున్నప్పుడు ఉన్నట్టుండి నన్ను చుట్టుముట్టేశారు. ఆ క్షణంలో నేను పరమ ప్రశాంతంగా వుండడం నాకే ఆశ్చర్యం కలిగించింది. నాలో ఎలాంటి భావ సంచలనం గానీ, ఉద్రేకం గానీ కలగలేదు. పోలీసులు నిర్బంధంలో పెట్టారు. మర్నాడు రైల్వే పోలీసు లాకప్ కు తీసుకువెళ్ళారు. ఒక నెల రోజులు అక్కడే గడిపాను. వారి మాటల్ని బట్టి కకోరి పార్టీతో నాకేదో సంబంధముందనీ విప్లవోద్యమ సందర్భంగా జరిగిన సంఘటనల్లో నా ప్రమేయం ఉందనీ వారి దగ్గర భోగట్టా వున్నట్టు నాకర్ధమయింది. లక్నో విచారణ సాగుతున్నప్పుడు నేనక్కడికి వెళ్ళాననీ, ఖైదీలను నిర్బంధం నుంచి తప్పించేందుకు ఒక పథకం గురించి ప్రస్తావించానని, వారి ఆమోదం పొందాక కొన్ని బంబులు కూడా సేకరించామనీ, వాటిని పరీక్షిద్దామని 1926 నాటి దసరా ఉత్సవంలో జన సమూహం మీద ఒక బాంబును వెయ్యటం జరిగిందని వాళ్ళు నాతో అన్నారు.                                  విప్లవ పార్టీ కార్యకలాపాల్ని వెల్లడి చేస్తూ ఒక స్టేట్ మెంట్ గనుక ఇస్తే ,నన్ను జైలు నుండి విడుదల చెయ్యడమే కాక, కోర్టులో అప్రూవర్ గా కూడా నిలువకుండా బహుమానం సైతం ఇస్తామని నా “మేలు” కోరి చెప్పారు. విని నవ్వేశాను . ఇదంతా హంబక్ , మా అభిప్రాయాలున్నవాళ్ళెవ్వరూ అమాయకులైన తమ ప్రజల మీద బాంబులు వెయ్యటం జరగదు.ఒక రోజు ఉదయం సి.ఐ.డి. శాఖ సీనియర్ సూపర్నెంటు న్యూమాన్ నా దగ్గరికొచ్చాడు. చాలసేపు సానుభూతి ఒలకబోస్తూ మాట్లాడాడు. తాము కోరినట్టుగా నేను స్టేట్ మెంట్ ఇవ్వకపోతే, కరోరీ కేసు సందర్భంగానూ, దసరా బాంబు ప్రయోగంలో ఘోరమయిన ఖూనీల సందర్భం గానూ కేసు పెట్టి ప్రభుత్వ వ్యతిరేక యుద్ధం చేసేందుకు కుట్రపన్నినట్లు నన్ను విచారణకు పంపక తప్పదనే విషాద వార్తను బయటపెట్టాడు. నాకు శిక్ష వేయించి, ఉరి తీయించడానికి తగినంత సాక్ష్యం తమ దగ్గర ఉందని చెప్పాడు. పోలీసులు తల్చుకుంటే ఏమయినా చేయగలరు గానీ,  నేను మాత్రం ఏ నేరమూ చేసి ఎరగననే అప్పట్లో అనుకున్నాను. అదే రోజున కొందరు పోలీసులు వచ్చి రెండు పూటలా వరసదప్పకుండా దేవుణ్ణి ప్రార్ధించవలసిందిగా నాకు చెప్పటం మొదలుపెట్టారు. అప్పటికే నేను నాస్తికుణ్ణై వున్నానుగదా! జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడే నేను నాస్తికుణ్ణని గొప్పలు చెప్పుకోవడమా? లేక ఇలాంటి కష్ట కాలంలో కూడా నా విశ్వాసాల్ని అంటిపెట్టుకొని వుండటమా? అనేది నాకు నేనే తేల్చుకోవాలనుకున్నాను. చాలా తీవ్రంగా ఆలోచించాను.
                           ఏ పరిస్థితిలో కూడా దేవుణ్ణి నమ్మలేనని, ప్రార్ధించలేనని నిర్ణయించుకున్నాను. అంతే మరెప్పుడూ ఆ పని చేయ్యలేదు.ఇదే నిజమైన పరీక్ష . నేను నెగ్గాను. ఇతర ముఖ్య విషయాలన్నీ బలిపెట్టి నా ప్రాణాన్ని నిలబెట్టుకోవాలన్న కోరిక నాకెప్పుడూ కలుగలేదు.అంటే నేను గట్టి నాస్థికుణ్ణి అయ్యానన్నమాట.ఈనాటికీ అంతే, ఆ పరీక్ష నెగ్గటమంటే మాటలు కాదు.’విశ్వాసం’ కష్టాల బరువును తగ్గిస్తుంది. ఒక్కోసారి కష్టాల్ని సుఖాలుగా కూడా మార్చగలుగుతుంది. భగవద్భక్తిలో మానవుడు ఊరట పొందుతాడు. రక్షణ కూడా లభించినట్టనిపిస్తుంది. దేవుడు లేకపోతే మానవుడు తనమీద తాను ఆధారపడాల్సిందే. జడివానల మద్య, తుఫానుల మద్య తన కాళ్ళ మీద తాను నిలబడటమంటే చిన్న పిల్లల ఆట కాదు. ఎలాంటి వ్యక్తిలోనైనా అహంకారమనేది వుంటే అది ఇలాంటి పరిక్షా సమయాల్లో ఆవిరై పోతుంది. పదిమందీ పాటించే నమ్మకాల్ని అతడొక్కడూ ధిక్కరించలేడు. ఒకవేళ ధిక్కరించగలిగాడో, అహంకారాన్ని మించిన మరొక బలమేదో అతన్లో ఉందనాలి.
     సరిగ్గా ఇప్పటి నాపరిస్తితి ఇదే.తీర్పు ఏవిధంగా ఉండబోతుందో నాకు బాగా తెల్సు. వారం రోజులోనే తీర్పు చెప్ప బోతారు. ఒక ఆదర్శం కోసం ప్రాణత్యాగం చేస్తున్నానన్న సంతృప్తితప్ప ఇంకే ఊరట ఉందినాకు? ఆస్తికుడయిన హిందువు అయినా మరో జన్మలో తానొక మహారాజుగా పుడతానని కలలు కనగలడు.ముస్లిమో,క్రైస్తవుడో అయితే తన బాధలకూ, త్యాగాలకూ ప్రతిఫలంగా స్వర్గ సుఖాల్ని ఊహించుకోగలడు. కాని నేనేం ఆశించాలి? నా కంఠం చుట్టూ ఉరిత్రాడు బిగుసుకొని,కాళ్ళ క్రింది చెక్కలు తప్పుకున్న క్షణమే నాకు అంతిమ క్షణం. అది నాకు తెలుసు. నేను- వేదాంత పరి భాషలో చెప్పాలంటే – నా ఆత్మ అంతటితో ఆఖరు. ఆ తర్వాత మరేం మిగలదు.ఈ దృష్టిలో అర్ధం చేసుకోగల సాహసం నాకుంటే- మహత్తరమైన ముగింపులేని పోరాటంతో కూడిన ఈ కొద్ది పాటి జీవితం ఒక్కటే నాకు గొప్ప బహుమానం. ఈ లోకంలో గానీ, పరలోకంలోగానీ బహుమానాలు పొందాలన్న ఏ స్వార్ధ చింతా, అభిలాషా లేకుండా, పరమ నిస్వార్ధంగా దేశస్వాతంత్ర్యం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. ఇంకోవిధంగా చెయ్యటం నా చేతకాదు. మానవజాతి సేవ,  మానవాళి విముక్తి కోసమే తమ జీవితాలను అంకితం చేసుకొనే మనస్తత్వం గల స్త్రీ పురుషుల సంఖ్య పెరిగిన రోజు- ఆ రోజే స్వేచ్చాయుగానికి నాంది పలుకుతుంది.
                     దోపిడీదార్లనూ,  పీడకుల్నీ,  నిరంకుశుల్ని సవాలు చేయడానికి ఈ జన్మలోగానీ,  మరు జన్మలోగాని, మరణానంతరం స్వర్గంలోగాని, రాజు నౌదామనో ఇతర పారితోషికాలు పొందుదామనో కాదు కోరవలసింది. మానవ జాతి మెడపైనుంచి దాస్యమనే కాడిని తొలగించాలని,  స్వేచ్చనూ,  శాంతినీ స్థాపించాలనీ ఉత్తేజం పొందాలి. సంకుచిత దృష్టి గలవారికిది పొరపాటనిపించినా,  ఉదార విశాల దృష్టి గలవారందరూ దీన్ని చరితార్ధమైన ఒకే ఒక పంధాగా గుర్తించి అనుసరించగలరు. ఇలా ఉదాత్త ఆశయం పట్లగల గౌరవ భావాల్ని గర్వంగా చిత్రించటం సాహసమే అవుతుంది. అలా అన్నవాణ్ణి మూర్ఖుడనో, దుష్టుడనో అంటారు. గుండెలో ఉప్పొంగే ఉద్రేకం, ఆశయబలం ఎంతగాఢమైనవో వాడికి అర్ధం కావు కాబట్టి వాణ్ణి క్షమించి వేద్దాం. వాడి గుండె ఒట్టి మాంసం ముద్దకంటే చచ్చుది. వాడి చూపులు పరమ నిర్జీవాలు. ఇతరేతర ప్రయోజనాల ప్రభావం వాణ్ణలా చేశాయి. ఆత్మవిశ్వాసాన్ని గర్వంగా వ్యాఖ్యానించే అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఇది విచారకరం, బాధాకరం అయినా తప్పదు.          

                                           బాగా ప్రచారంలో ఉన్న విశ్వాసాల్ని వ్యతిరేకించినా, విమర్శకతీతుడనీ, దోషరహితుడనీ జనంలో ముద్ర వేసుకున్న ఒక గొప్ప వ్యక్తిని విమర్శించినా, నువ్వొట్టి డంబికుడవని ఆ జనమే నిన్ను తిట్టిపోస్తుంది. దీనికి కారణం వారి బుద్దిమాంద్యమే. విప్లవకారుడైనవాడికి తప్పనిసరిగా ఉండవలసిన గుణాలు రెండు – ఒకటి విమర్శనా ధోరణి, రెండు స్వతంత్ర ఆలోచనా సరళి. మహాత్ముడు చాలా గొప్పవాడు. కాబట్టి ఎవ్వరూ ఆయన లోపాల్ని వేలెత్తి చూపకూడదు. జన్మలో ఎంతో ఉన్నతంగా నిలవగలిగాడు కాబట్టి, రాజకీయాల్లో గాని, మతంలో గాని, ఆర్ధిక విషయా విషయాల్లో గాని, నైతిక విషయాల్లో గాని ఆయన చెప్పిందే వేదంగా భావించాలి. ఆ మాటల్లో నీకు నమ్మకం కుదిరినా కుదరకపోయినా అదంతా నిజమని ఒప్పుకు తీరాలి. ఇలాంటి మనస్తత్వం దేశపురోగమనానికి కాదుగదా, తిరోగమనానికి దారితీస్తుంది. 

                 సర్వశక్తిసంపన్నుడైన దేవుడి పైన మన తాతముత్తాతలు నమ్మకం కుదుర్చుకున్నంతమాత్రాన, ఆ నమ్మకాన్ని గాని ఆ దేవుడి వునికినిగాని సవాలు చెయ్యకూడదా? ఎవరైనా అలా సాహసిస్తే మతద్రోహి, భ్రష్టుడు అనిపించుకోక తప్పదు. తన బలమైన వాదంతో ఎదుటి వారి వాదాల్ని చిత్తుగా తిప్పికొట్టగలిగితే, పరమేశ్వరుడి దురాగ్రహానికి గురికావడం వల్ల వచ్చే కష్టనష్టాలకు గుండెనిబ్బరం చెదరకపోతే అతణ్ణి డాంబికుడంటారు. అలాంటప్పుడు ఈ వృధా చర్చతో కాలహరణం చెయ్యడమెందుకు? ఈ విషయాన్నంత తర్కించడమెందుకు? ఈ సమస్య జనం ముందుకు మొదటిసారిగా ఇప్పుడే వచ్చిందిగనుక ఈ విషయంలో ఇదే చర్చకు దారితీస్తుంది కనుక సుదీర్ఘమైన పరిశీలన చెయ్యవలసివచ్చింది.
           నన్ను నాస్తికుణ్ణి చేసింది గర్వం కాదని స్పష్టం చేశాననుకుంటాను. నా వాదనా సరళి నచ్చిందీ లేనిదీ చెప్పవలసింది పాఠకులేకాని నేనుకాదు. ప్రస్తుత పరిస్థితిలో నాకు దేవుళ్ళ పైన నమ్మకమే వుంటే నా జీవితం ఎంతో హాయిగా వుండేది. నా గుండె బరువు తేలికనిపించేది. దైవనమ్మకం లేనందువల్ల పరిస్థితులు పరమ నీరసంగా తయారై, కర్కశంగా కూడా రూపొందవచ్చు. కాసింత భక్తి పారవశ్యమే వుంటే నాకీ క్షణం ఎంత మధురంగా వుండేదో! కానీ నా జీవితంలో నిర్దాక్షిణ్యమైన ఈ పరిస్తితిని ఎదుర్కోడానికి ఏ మత్తు అక్కరలేదు. నేను వాస్తవవాదిని.హేతుబద్ధమైన ఆలోచనలతో నా సహజ దౌర్బల్యాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నవాణ్ణి. అయితే అన్నివేళలా నేను గెలవకపోవచ్చు. ప్రయత్నించడం మనిషి కనీసపు బాధ్యత.ఫలితం పరిస్థితులకే వదిలెయ్యాలి. 
            ఇక రెండో విషయానికొద్దాం.
            దేవుడి వునికి గురించి చిరకాలంగా వుంటున్న నమ్మకాన్ని కాదనడానికి గర్వమే కారణం. కాదనుకుంటే మరో కారణమేదైనా వుండాలి, వుందికూడా. అదే హేతువాద దృక్పధం.  ఈ హేతుదృష్టి ఏమాత్రం ఉన్నా మనిషి తన పరిసరాల్ని అర్ధం చేసుకోగలడనే నా అభిప్రాయం. సాధారణంగా ప్రత్యక్ష ప్రమాణాలు లేనప్పుడే మతతత్వానికి ప్రముఖ స్థానం లభిస్తుంది. నేనిదివరకే చెప్పినట్టుగా ఒక విప్లవకారుడి అభిప్రాయం ప్రకారం, మానవుడి హృదయదౌర్భల్యం వల్లనే మతతత్వం ఉత్పన్నమౌతుంది. ప్రత్యక్ష ప్రమాణాలు అసలేవీ లేని కాలంలో, ఈ విశ్వ రహస్యం గురించి, భూత,భవిష్యత్, వర్తమానాల గురించి ఆలోచించడానికి కావలసినంత తీరిక వున్న కాలంలో ప్రతివాడూ తనకు తోచిన విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని చూశాడు. విభిన్న మత సిద్ధాంతాలలో మౌలిక బేధాలిందువల్లనే వచ్చాయి. ఒక్కొక్కప్పుడు ఇవి పరస్పరం విరుద్ధంగా తయారై తమలో తాము సంఘర్షించుకుంటాయి కూడా. ప్రాచ్య, పాశ్చాత్య దేశాల మధ్య ఈ మత విబేధాలు ఎలాగూ ఉన్నాయి. అంతేకాదు, ఇటు ప్రాచ్య దేశాల్లోనూ వివిధ మత సాంప్రదాయాల మధ్య ఎన్నెన్నో విబేధాలున్నాయి.ప్రాచ్య దేశాలలో హిందూ మతానికీ, ముస్లీం మతానికీ చుక్కెదురు. ఇండియాలో కొన్ని వేల సందర్భాలలో బౌద్దజైనులు, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వున్నాయి.బ్రహ్మణ మతంలో మళ్ళీ ఆర్యసమాజమనీ, సనాతన ధర్మమనీ పరస్పర  విరుద్ధమైన మత విశ్వాసాలున్నాయి. 
        గతించిన యుగాలకు చెందిన ఒక స్వతంత్ర భావుకుడు చార్వాకుడు. చార్వాకుడొకరా, పలువురా? ఏమైతేనేం.ప్రాచీన కాలములోనే దైవాధికారాన్ని సవాలుచేశాడు. కాబట్టి ప్రధాన విషయం గురించి ఈ భిన్న మతాలన్నీ విభేధిస్తున్నాయి. ప్రతివాడూ తనమతమే నిజమనుకుంటాడు. అదే దౌర్భాగ్యం. అజ్ఞానానికి వ్యతిరేకంగా ముందు ముందు మనం సాగించబోయే పోరాటంలో ప్రాచీన భావుకుల, మేధావుల ప్రయోగాలనూ, భావననూ ప్రాతిపదికగా వుపయోగించుకొనే బదులు, ఈ నిగూఢ సమస్యకు పరిష్కారాన్ని సాధించడానికి బదులు మనం జడత్వం వల్ల విశ్వాసం, విశ్వాసం అంటూ గొంతు చించుకొని గోల చేస్తున్నాం. ఇంకా ఎవరి విశ్వాసాల్ని వారు పట్టుకొని వేలాడుతూనే వున్నారు.మానవ ప్రగతి స్థంభించిందంటే నేరస్తులు వీరే.                                                                   

 ప్రగతిని కోరే వారెవరైనా సరే, పాత మతాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ విమర్శించి,సవాల్ చెయ్యాలేగాని, గుడ్డిగా నమ్మకూడదు. పదిమంది పాటిస్తున్న మత విశ్వాసాన్ని ఏమూల కామూల శోధించి,ఒక అంశం తరువాత మరొక ఆంశాన్ని తర్కించాలి. ఆ తర్వాత కూడా ఒకరికి మత సిద్ధాంతంలో నమ్మకం ఏర్పడితే , ఆనమ్మకానికి స్వాగతం. అతని తర్క పద్ధతి అప సవ్యమై ఉండవచ్చు. తప్పు దారి తొక్కవచ్చు. లోపభూయిష్టం కావచ్చు.- అతని జీవితానికి హేతు దృక్పధమే ధృవతార కాబట్టి అతణ్ణి సరిదిద్దే అవకాశం ఉంది. గుడ్డి నమ్మకమే పరమ ప్రమాదకరం. ఇది బుద్ధిని మందగింప జేస్తుంది. మనిషిని వెనక త్రోవ పట్టిస్తుంది. వాస్తవవాదినని చెప్పుకునేవాడు పాత మతాన్ని మొత్తంగానే ప్రశ్నించాలి. తర్క బలాన్ని ఎదుర్కోలేకపోతే అది కుప్ప కూలి పోతుంది. అప్పుడతడు చెయ్యవలసిన మొదటిపని పాత సిద్ధాంతపు కట్టడాన్ని తుత్తునియలుచేసి ఒక నవ్య తత్వ నిర్మాణానికి కావలసిన స్తలాన్ని సమకూర్చడం.అంతవరకు నిర్మూలనం.దీనిమీదట నిర్మాణాత్మక కార్యక్రమం మొదలవుతుంది. పునర్నిర్మాణం కోసం ఒక్కొక్కప్పుడు పాత మతవిశ్వాసాల తాలూకు సామాగ్రి కొంతయినా అవసరం కావచ్చు.ఈ విషయం గురించి నేనెక్కువగా అధ్యయనం చేయలేదని ముందుగానే ఒప్పుకుంటాను. ప్రాచ్య మతాన్ని అద్యయనం చేద్దామని నాకు చెడ్డ కోరిక. కాని తగిన అవకాశం లేదు. పాత మత సిద్ధాంతాల లోపాల్ని మాత్రం సవాలు చేసేంత నమ్మకం, ధైర్యం నాకేర్పడ్డాయనే అనుకుంటాను. ఈ చరాచర ప్రకృతినంతా శాసించి నడిపే పరబ్రహ్మ పదార్ధం ఏదీలేదని నా గట్టి అభిప్రాయం. ప్రకృతి అంటే నమ్మకముంది.ఆ ప్రకృతిని మానవుడు తన సేవా సాధనంగా మార్చుకోవడమే అభుదయ లక్ష్యం .నేపథ్యంలో నిలిచి దీన్ని నడిపే చైతన్య పూరితమైన చోదక శక్తేదీ లేదు. ఇదీ మన అవగాహన.

                                                    ఆస్తికుల్ని మనం కొన్ని ప్రశ్నలడగవచ్చు. సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ, సర్వశక్తిసంపన్నుడూ అయిన దేవుడనేవాడొకడుంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిందెందుకో చెప్పమనండి.ఎన్నో దుఖాలతో నిండి గందరగోళంగా వున్న ఈ లోకంలో ఒక్క జీవి కూడా సంతృప్తి పొందక పోవడానికి కారణ మేమిటో? ఇది దేవుడు చేసిన నియమం అని మాత్రం అనకండి. దేవుడు కూడా ఒక నియమానికి బద్దుడై వుంటే, ఆయన సర్వశక్తి సంపన్నుడు కాలేడు కదా? ఇదంతా దైవలీల అని కూడా అనకండి; నీరో చక్రవర్తి తన సంతృప్తి కోసం ఒక్క రొమ్ నగరాన్ని తగలబెట్టించాడు. కొద్దిమందినే వధించాడు. కొన్ని బాధల్నే కల్పించాడు. అయితే చరిత్రలో అతని స్థానం ఏమిటి? చరిత్రకారులు ఏఏ పేర్లతో అతన్ని వర్ణిస్తారు? నిరంకుశుడు, నిర్దయుడు, దుర్మార్గుడు- ఎన్నో నిందా వాచకాలతో పేజీలకు పేజీలు నలుపెక్కాయి. అతన్ని గురించి ప్రయోగించని దూషణలు లేవు. కేవలం తన ఆనందం కోసం వేలాది మంది ప్రాణాలు తీసిన ఛెంఘిజ్ ఖాన్ పేరంటేనే మనకు ద్వేషం. మరి ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి నిముషం ఎన్నో ప్రాణాల్ని బలిగొంటున్న సర్వ శక్తి సంపన్నుడైన దేవుణ్ణి-శాశ్విత నీరోని – మీరెలా సమర్ధిస్తారు? ప్రతిక్షణం ఛెంఘీజ్ ఖాన్ ను తలదన్నిపోయే దేవుడి అక్రమాలను ఎలా ప్రశంసిస్తారు? నిరంతరం దారుణమైన అశాంతికి నిలయమైన నరకం లాంటి ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడని ప్రశ్నిస్తున్నాను? మనిషిని సృష్టించకూడదని దేవుడు భావించివుంటే , ఆ శక్తి ఆయనకుందిగదా, మరెందుకు సృష్టించాడు మనిషిని? దీనికంతతికీ ఏమిటి మీ సమాధానం? పాపం పుణ్యం తెలియని అమాయకుల్ని రక్ష్నిచడానికి, దుష్టుల్ని శిక్షించడానికీ అంటారా? భేష్! తీవ్రంగా గాయపరచి, ఆ తర్వాత మందుపూసే మనిషిని మీరు సమర్ధించగలరా? మొదటేమో ఆకలిగొన్న సిం హాల ముందు మనుషుల్ని తొయ్యడం , ఆ తర్వాత ఆ కౄరమృగాల బారినుండి ఒకవేళ తప్పించుకోగలిగితే అప్పుడేమో గౌరవించడం ఆ ద్వంద ధోరణిని ప్రదర్శించే కపటుల్ని మనం ఎంతవరకు వెనకేసుకురావచ్చు? అందుకే అడుగుతున్నాను. ” సర్వజ్ఞుడైన దేవుడు ఈ ప్రపంచాన్ని ,అందులోని మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు?” అని .వినోదం కోసమా? అయితే దేవుడికీ, నీరోకి తేడా ఏమిటి?

                                                    మహమ్మదీయులారా!, క్రైస్తవులారా! ఈ ప్రశ్నకు మీ జవాబులేమిటో చెప్పుకోండి? పూర్వ జన్మలో మీకు నమ్మకం లేదాయె. ఈ జన్మలో పాపం పుణ్యం ఎరగని అమాయకులు పూర్వజన్మలో చేసుకున్న పాపాల ఫలితంగా కష్టాలను అనుభవించితీరాలనే వాదాన్ని హిందువుల్లాగా మీరు చేయలేరుగదా? అంత శక్తి గల దేవుడు “మాట” ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆరు రోజులపాటు పాటుపడవలసిన అవసరం ఏమిటి? అంతా సవ్యంగానే సాగుతోందని ప్రతిరోజూ అనవలసిన అవసరం ఎందుకొచ్చింది? రమ్మనండి ఆ దేవుణ్ణి ,గత చరిత్రను చూపించండి. ఈ నాతి పరిస్థితుల్ని అధ్యయనం చెయ్యమనండి. “అంతా సవ్యం” అనడానికి సాహసించగలడేమో, అదీ చూద్దాం.

                                                    చీకటి కొట్లలాంటి జైళ్ళు,   ఒక వైపు మురికివాడల మధ్య గుడిసెల్లో నివసించే లక్షల, కోట్ల నిర్భాగ్యులు,       మరోవైపు వ్యర్ధంగా పడివున్న సంపదలు.    పేదల రక్తాన్ని పీల్చే పెట్టుబడిదారీ రక్కసి జలగలు,            పట్టీపట్టనట్టుగా చూస్తూ దోపిడీకి గురౌతున్న శ్రామికులు,         ఏమాత్రం ఆలోచించేవారికైనా గుండె చెరువయ్యే విధంగా దుబారా అవుతున్న మానవుల శక్తియుక్తులు,          అదనపు ధాన్యోత్పత్తిని-కష్టపడి పండించే శ్రమజీవులకందకుండా- గంగ పాలు చేసే నిర్దయ , వీటన్నిటినుంచీ అటు మానవుల ఎముకల పోగుల పునాది మీద లేచిన రాజ సౌధాలు      ఇదంతా చూసి కూడా ” అంతా సవ్యం ” అంటాడా దేవుడు?     ప్రపంచంలో ఇంత దారుణమైన పరిస్థితులెందుకున్నాయి?     ఇదే నా ప్రశ్న.   మీరు మాట్లాడరు సరే.   మిమ్మల్ని వదలి ముందుకు వెళతాను.

                                                    ఓ హిందువుల్లారా! పూర్వజన్మలోని పాపులే ఈ జన్మలోని పీడితులూ,దరిద్రులూ అంటున్నారుగదా మీరు? అంటే ఈ జన్మలోని పీడకులు గత జన్మలో సజ్జనులా? అందుకే అధికారం అపనమ్మకాన్నీ కొట్టేయగల సిద్ధాంతాలను కనిపెట్టిన మీ పూర్వీకులున్నారే ,మహా తెలివైనవాళ్ళు. అయితే ఈ వాదం కూడా ఏమాత్రం నిలుస్తుందో చూద్దాం.

                   సుప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్తల దృష్టిలో ,తప్పుకు తగిన శిక్షవెయ్యాలనో ,సంస్కరించాలనో – ఇలా ఏవో కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొనే నేరస్తుల్ని దండించడం జరుగుతుంది.తప్పుకు తగిన ఫలితం అనుభవించాలన్న దృష్టిలో శిక్ష వెయ్యడం మంచిది కాదని ఆలోచనాపరులంతా చెబుతున్నారు.మళ్ళీ తప్పులు చెయ్యకుండా ఉండడం కోసమే శిక్ష వేసేపద్దతివల్ల కూడా ప్రయోజనం లేదని వారి అభిప్రాయం. పోతే మానవ ప్రగతికి అవసరమైనది సంస్కరణలతో కూడిన శిక్షావిధానమే. నేరస్తుణ్ణి మంచి పౌరుడుగా మార్చి సమాజంలో కలపటమే దాని లక్ష్యం. మానవులు నేరస్థులే అనుకొంటే, మరి భగవంతుడు విధించే శిక్ష స్వభావం ఎలాంటిది? చెట్టుగానో ,పుట్టగానో, కుక్కగానో,నక్కగానో పుట్టమని దేవుడు దండన విధిస్తాడని అంటారు మీరు.ఈ దండనల సంఖ్య ఎనభైనాలుగు లక్షలని లెక్క దీస్తారు.ఈ శిక్షలెంతవరకు మానవుల్ని సంస్కరించగలవో చెప్పమని అడుగుతున్నాను.ఏదో పాపం చేసినందుకు గాడిదగా పుట్టామని చెప్పేవాళ్ళను ఎంతమందిని చూశారు మీరు? ఒక్కడూ కనబడడు. పురాణాల దస్త్రం విప్పండి. మీ కట్టుకథల్ని స్పృశించే అవకాశం లేదు నాకు.అంతేకాదు. ఈ ప్రపంచంలో పేదరికం కంటే గొప్ప పాపం లేదని మీకు తెలుసా? పేదవాడుగా శిక్షల్ని ప్రతిపాదించే నేరశాస్త్రజ్ఞుల్ని , న్యాయ శాస్త్రవేత్తలనూ,శాసన కర్తలనూ ఎలా మెచ్చుకోగలరు? మీ దేవుడు ఈమాత్రం ఆలోచించలేడా? లేకుంటే- మానవకోటి స్వానుభవం ద్వారా అనుభవించవలసివచ్చిన బాధల మూలంగానే దేవుడంతటివాడు తెలుసుకోవలసి వచ్చిందా? అక్షర జ్ఞానమేలేని నిరుపేద అయిన చర్మకారుడి ఇంట్లోనో, పాకీ వాడి ఇంట్లోనో పుట్టేవాణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి? వాడు పేదవాడు.కనుక చదువుకోలేడు.అంతకంటే పెద్దకులంలో పుట్టి గొప్పవాళ్ళమనుకునే తోటి మనుషులు అతణ్ణి అసహ్యించుకుంటారు. నీచంగా జూస్తారు. ఒక పక్క తన అజ్ఞానం, పేదరికం, మరో ప్రక్క సమాజం నుండి తనకు లభించే నిరాదరణ – వీటివల్ల సమాజం అంటేనే తన గుండెను బండగా మార్చుకుంటాడు. అలాంటి పరిస్థితిలో అతడొక పాపం చేస్తే దాని ఫలితం పొందవలసిందెవరు? తానా? దేవుడా? లేకపోతే సమాజంలోని విద్యావంతులా? ఎవరు? గర్వంతో , అహంకారంతో ఉద్దేశ్యపూర్వకంగానే బ్రాహ్మణులు వీళ్ళందర్నీ అజ్ఞానంలో అట్టిపెట్టారు. “పరమ పవిత్ర” గ్రంధాలైన వేదాలనుంచి ఏవో కొన్ని వాక్యాలు విన్నారని వారి చెవుల్లో మరిగే సీసం పోయించారు.ఈ శిక్ష మాటేమిటి? వాళ్ళేదైనా అక్రమం చేస్టే దానికెవరిది బాధ్యత? బాధ్యత ఎవరిదైనా శిక్ష వాళ్ళే అనుధవించాలా? మిత్రులారా, వినండి. ఈ సిద్ధాంతాలన్నీ కడుపు నిండినవాళ్ళు సృష్టించినవే. అక్రమంగా తాము సంపాదించుకున్న అధికారాన్ని,సిరి సంపదల్ని సమర్ధించుకునేందుకే ఇవన్నీ. ఆప్టన్ షింక్లేరు అనుకుంటాను ఒకచోట అంటాడు. మనిషికి దైవం పైన నమ్మకం కలిగించు, ఆతర్వాత అతని ఆస్తిపాస్తుల్ని కొల్లగొట్టడం తేలిక అని. దోపిడీకి గురయ్యేవాడే నీకు సాయపడతాడు కూడా. మత ప్రచారకులు, అధికార మధాంధులూ కుమ్మక్కై ఈ జైళ్ళనూ ,శిక్షలనూ ,ఈ సిద్ధాంతాలనూ పుట్టించారు.                                   

                                                 ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైనా పాపంగానీ, నేరంగానీ చేస్తున్నాప్పుడే  సర్వ శక్తి సంపన్నుడైన మీ దేవుడెందుకు నిరోధించడంలేదు? ఆ పని ఆయన్ అవలీలగా చేయవచ్చు   గదా! యుద్ధోన్మాదుల్నీ వారి దురాగ్రహాల్నీ హతమార్చి, ప్రపంచ యుద్ధ సమయంలో మానవకోటిమీద విరుచుకుపడ్డ దారుణ దురాగతాల్ని ఎందుకు నిరాకరించలేదు. ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలన్న హృదయ పరివర్తనను బ్రిటిషువారికి ఎందువల్ల కలిగించడం లేదు. ఉత్పత్తి సాధనాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారులందరికీ త్యాగబుద్ధినీ ,పరోపకార భావాన్నీ కలిగించి ,ఈ పెట్టుబడిదారీ దాస్యం నుంచి శ్రామిక జనాన్నేకాదు, మానవ సమాజాన్ని ఎందుకు విముక్తి చెయ్యడు? సోషలిష్టు సిద్ధాంతం ఆచరణీయమా,కాదా అని మీరు తర్కిస్తున్నారే? దాన్ని ఆచరణీయం చెయ్యమని మీ దేవదేవుడికే వదిలేస్తున్నాను. సర్వజన శ్రేయస్సుకు సంబంధించినంతవరకూ సోషలిజాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆచరణయోగ్యం కాదనే సాకుతోనే వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా ఆ సర్వేస్వరుణ్ణే జోక్యం చేసుకొని చక్కదిద్దమనండి. డొంక తిరుగుడు వాదాలు మాత్రం చెయ్యకండి. బ్రిటీషు వారి శక్తిని ఎదుర్కొనే సాహసం మనకులేదు గనకనే మన దేశంలో వాళ్ళ పాలన కొనసాగుతుంది గాని, దేవుడి కోరికవల్ల మాత్రం కాదని చెబుతున్నాను. తుపాకులూ, రైఫిళ్ళూ,బాంబులూ, బులెట్లూ, పొలీసులూ, సైన్యం- వాటికితోడు మన నిర్లక్ష్యం వల్లనే బ్రిటీషు వాళ్ళు మనల్ని తమ కాళ్ళ కింద తొక్కి పెడుతున్నారు. ఒక జాతిని మరొకజాతి పరమ దుర్మార్గంగా దోచుకోవడమనే దారుణ పాపకార్యానికి ఒడిగడుతున్నారు. అంతేగాని , దేవుని దయతోనో ,సహాయంతోనో మాత్రం కాదు. ఏడీ మీ దేవుడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మానవ జాతి అనుభవిస్తున్న యాతనల్ని చూసి ఆనందిస్తున్నాడా? అతడొక నీరో ,ఛంఘీజ్ . దేవుడు నశించాలి.

                                                        అయితే ఈ ప్రపంచం ఎలా పుట్టిందో, మనిషెలా పుట్టాడో వివరించమంటున్నారా? అలాగే. ఈ విషయం గురించి చార్లెస్ డార్విన్ కొంత దారి చూపాడు. అతని రచనలు చదువుకోండి. సోహం స్వామి వ్రాసిన “కామన్ సెన్స్ ” కూడా చూడండి. మీ ప్రశ్నలకు కొంతవరకైనా జవాబు లభిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మకణాల రూపంలో వివిధ ద్రవ్యాల ఆకస్మిక సం యోగ సమ్మిశ్రమణాల ఫలితంగా ఈ భూమి రూపొందింది. ఎప్పుడు? చరిత్ర నడగండి. ఇదే గతిక్రమం వల్ల జీవజాలం ఆ తర్వాత ఎంతోకాలానికి మానవుడు రూపొందడం జరిగింది. ఆ పైన సాగిందంతా ప్రకృతితో మానవుని ఘర్షణవలన ప్రకృతిని శాసించాలనే అతని ప్రయత్నం వల్ల ఏర్పడిందే. ఈ విషయాన్ని ఇంకా సూక్ష్మంగా చెప్పటం వీలుకాదు.

                                         పూర్వ జన్మలో పాపాలు చెయ్యకపోతే మనిషి గుడ్డివాడుగానో , కుంటివాడుగానో ఎందుకు పుడుతున్నాడని మీరు మరో వాదం చెయ్యవచ్చు.జీవశాస్త్రజ్ఞులు దీనికి శాస్త్రపరమైన కారణాలు చెప్పేవున్నారు.తాము మంచి పనులు చేస్తున్నారో లేదో అనేస్పృహవున్నా లేకపోయినా అంగవైకల్యంతో పిల్లలు పుట్టడానికి కారణం తల్లిదండ్రులేనని వారి నిర్ణయం.
                                                            పిల్ల తరహాగా అనిపించినా ,సాధారణంగా ఇంకో ప్రశ్న అడుగుతారు మీరు. అసలు దేవుడనేవాడే లేకపోతే జనానికి దైవనమ్మకం ఎలా ఏర్పడుతుంది? దీనికి నా సమాధానం చాలా స్వల్పమైనదీ,చిన్నదీ. దెయ్యాలను , క్షుద్ర శక్తుల్నీ ఎలా నమ్ముతూ వచ్చారో , దేవుణ్ణీ అలాగే నమ్ముతూ వచ్చారు. కాకుంటే దైవభావం విశ్వవ్యాప్తమై ,అదొక తత్వంగా రూపొందింది. పరమ పురుషుడొకవున్నారని నూరిపోసి జనాన్ని మభ్యపెదుతూ, దాస్యంలో అట్టిపెట్టి , తమ ఉన్నత స్తానాల్ని నిలుపుకునేందుకు దేవుణ్ణి ప్రమాణంగా చూపుతున్న దోపిడీదారుల చాకచక్యమే దైవభావం పుట్టుకకు కారణమని కొందరు తీవ్రవాదులంటారుగానీ నేనలా అనుకోవడంలేదు.విశ్వాసాలూ,మతాలూ, మతశాఖలూ, ఇతర సంస్తలూ- ఇవన్నీ కాల క్రమాన నిరంకుశంగా ప్రవర్తించే దోపిడీ సంస్థలన్నీ మనుషుల్నీ వర్గాల్నీ బలపరిచే సాఢనాలుగా మారిపోయాయనడంలో మట్టుకు నాకు వారితో భిన్నాభిప్రాయం లేదు. ఏమతంలోనైనాసరే రాజుమీద తిరగబడడం పాపమే.

                                  దైవభావం ఏర్పడడానికి నా దృష్టిలో కొన్ని కారణాలున్నాయి. మనిషి తన బలహీనతల్ని, లోపాల్ని బాగా గుర్తించాక అన్ని రకాల సంకట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలవడానికి ,ప్రమాదాల్ని నిబ్బరంగా ఎదుర్కోవడానికి దైవభావం అవసరం అయింది. సంపదలెక్కువై భోగభాగ్యాలనుభవిస్తున్న దశలో విశృంఖలంగా విజృంభించకుండా అడ్డుపడి అదుపులో పెట్టడానికి కూడా దేవుణ్ణి పట్టుకురావడం జరిగివుంటుంది.

                                     దేవుడికి సొంత చట్టాలు కొన్ని వున్నట్లుగా , తండ్రికుండే దయాగుణం వున్నట్లుగా మరికొన్ని లక్షణాలు చేర్చి చిత్రించడం జరిగింది.దేవుడి చట్టాల్ని గూర్చి చర్చ వచ్చినప్పుడు మనిషి ప్రమాదకరంగామారకుండా ఉండడానికి దేవుడి అవసరం ఏర్పడింది. ఇక జగత్పితగా తన యోగ్యతను నిరూపించవలసి వచ్చినప్పుడు తండ్రిగా, తల్లిగా, సోదరిగా, సోదరుడిగా వర్ణించారు.కావలసినవాళ్ళే వెన్నుపోటుపొడిచి, ఏకాకిని చేసినప్పుడు మనిషి ఎంటో మానసిక క్షోభకు గురవుతాడు. అప్పుడు తనని వీడని స్నేహితుడొకడున్నాడని , ఆదరువుగావుండి ఆదుకుంటాడని, సర్వ శక్తి సంపన్నుడు గనుక ఆయన్ను తల్చుకుంటే ప్రమాదం ఉండదని అనుకుని మనిషి ఒకరకమైన ఊరట పొందుతాడు.ఆదిమ కాలంలో మాత్రం ఈ భావం నిజంగానే ఉపయోగకరంగా వుండేది.బాధలపాలైన మనిషికి దైవభావం సహాయకారి.

                                         విగ్రహారాధననీ, సంకుచిత మత వైఖరినీ సమాజం లోగడ ఎలా ఎదిరించి పోరాడిందో,  అలా ఈ దైవనమ్మకాన్ని ఎదిరించి పోరాడాల్సివుంది.తన కాళ్ళ మీద తాను నిలవాలనుకున్న మనిషి మత విశ్వాసాన్ని తోసివేయాలి.పరిస్థితులవల్ల ఏర్పడే కష్టాల్నీ, నష్టాల్నీ నిబ్బరంగా ఎదుర్కోవాలంటే వాస్తవవాది కావాలి. దేవుణ్ణి నమ్మటం, రోజూ ప్రార్ధనలు చెయ్యడం – ఇవి పరమ నీచమైన స్వార్ధ బుద్ధితో మానవుణ్ణి తక్కువ చేసేవని నాకనిపిస్తాయి. నన్ను బాగు చేస్తాయో, పాడు చేస్తాయో నా విషయానికొస్తే నాకే తెలియదు. ఎన్ని బాధలైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న నాస్తికులు గురించి చదువుకొనియున్నాను. అంచేత, చివరిదాకా, ఉరికంభం మీదైనాసరే తల పైకెత్తుకొని నిలబడాలనే ప్రయత్నిస్తున్నాను.
                                               దీన్నెలా నిర్వహించగలనో చూద్దాం. ప్రార్ధన చెయ్యమని మిత్రుడొకడు ఉపదేశించాడు. నాస్తికవాదం గురించి చెప్పినమీదట ” నీ చివరి రోజుల్లో అయినా ఆస్తికుడవైపోతావు ” అన్నాడు. అది ” అసంభవం ” అన్నాను. అలాంటిపని నా పతనాన్ని, నా అధైర్యాన్ని సూచిస్తుంది. స్వార్ధం కోసం చచ్చినా ప్రార్ధించను. పాఠకులారా , మిత్రులారా, ఇది అహంభావమా? ఇది అహంభావమే అయితే నేను అహంభావినే.

                                                                         –ఏప్రిల్,2007  ఉపాధ్యాయ పత్రిక సౌజన్యంతో

                                     

మా గూడెంలోకి రా

16/04/2007

అమ్మే
నువాంది నిజమే సామే!
అగ్గురారాల్లో ఏముంటది
బెమ్మమొకం నుంచి ఊడిపడ్డట్టు ఆంకారం ఈసు
ఉచ్చులు తగిలిచ్చే ముచ్చు మడుసులు
కడుపుల నిండా బెమ్మజెముళ్ళు
అబద్ధాల మాయల మంత్రాల బతుకులు
కట్టుబాట్ల కట్టుమడులు
అన్నీ వదిలి రా
మా గూడెంలోకి రా
మడులు గుడులు అగ్గురారాలొదిలి
గాటి బతుకునొదిలి
మా గూడెం మనుసుల మజ్జెకి పా
పోదాం పా
 గెడ్డి పూలు పూసినట్టు
మంచు బొట్లు రాలినట్టు
సల్లగాలి తోలినట్టు
వడగాలి కొట్టినట్టు
వానతుంపర రాలినట్టు
బళ్ళున తెల్లారినట్టు
మావోళ్ళ నవ్వులుంటయి
సెమటోసనో సేనోసనో మట్టోసనో
మన్నులో పుట్టిన మొక్కలసుమంటి పసరు వాసనో
మా గూడెపోళ్ళ బతుకు వాసన
నీకిట్టమైతదో కట్టమైతదో సూద్దువు పా
పోదాంపా, మా గూడెం మణుసుల మజ్జెకి
 ఒక సెంప ఎండ ఇంకోసెంప ఎన్నెల తాకి
సీకటీ ఎలుగు ఎండావాన మట్టిబురద
               నాకిన వొళ్ళు మాయి
కాల్చిన ఈరిగెలూ దొప్పలు సియ్యల కూర
సంకటి ముద్దలు పుల్లనీళ్ళు
వొట్టి శాపల శాకం ఎండు తలకాయల కారం
సింతాకు పొడి రొయ్యల కారం తిందువుగానిదాతిం తిందువుగాని రా
తిరగలి ఇసుర్లు రోకటి దంపులు
లల్లాయి పాటల సిందరువులు
ఇచ్చురుతో పిల్లలు మూసిన మూకుడు తప్పేట్లు
                 ఇందువుగాని రా
సీమిడి బుగ్గల సంటోల్లాటలు సూద్దువుగాని
రా పోదాం మాపాటి మనుసుల మజ్జెకి
 
అమ్మే
మా గూడెంలో బతకాలంటే
         కూసింత దయిర్నముండాల
ఎండిన మొకంలోనూ రవొంత
         ఎన్నెల్లాంటి నవ్వులుండాల
సీకట్లోనూ ఎలుతరయ్యే కండ్లుండాల
మందిని కలేసుకుపోయే మనసుండాల
సూరిణ్ణి సజ్జరొట్టెలా కాల్సే కసి ఉండాల
పచ్చి పియ్యి దొక్కితే పదారొక్కలయ్యే
                    సత్తావుండాల
ఉంటే రా మాగూడెంలోకి
 
  
బాగిశాలో!
నీకు కట్టం రానీయరు
కడుపులోది దీసి పెడతరు
కళ్ళలోన దాసుకుంటరు
గుంపు శరద మా గూడెపోళ్ళది
రా బంగారం
మా గూడెంలోకి
ఇదుగో ఈ సెట్టుసాయ సూడు
పూసే పూలసుంటి ఎగిరే పిట్టలసుంటి
పొడిసే పొద్దసొంటి మెరిసే సుక్కలసుంటి
కలలు కనటం నేర్సుకుంటవు
ఊసుల్ని రాసిలకల్లా ఎగరేసుకో
పచ్చి రెక్కలు ఇదిలిచ్చినట్టు
నీ బయాలు వొదిలిపోతయి
సేచ్చిని తూనీగ జేసి ఆడుకోనీ
రా మా గూడెంలోకి
(జయప్రభ కవిత చదివి)
      – కృపాకర్ మాదిగ