Archive for the 'my collections' Category

దేశంలో 196 భాషలను రక్షించే దెవరు?

17/08/2009

2008, జనవరి ,21న మేరీ స్మిత్ జోన్స్ మరణించింది. ఆమె అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో ఇండియన్ మూలాలకు చెందిన ఒక సాధారణ ఆదివాసీ మహీళ. జార్ఖండ్ రాజధాని రాంచీకి ఆనుకొని వున్న అనాగరిక ప్రాంతాల్లోని సంతల్లో తిరిగే ఒక మహిళలానో , లేకపోతే రాజమహళ్ళకు సుదూరంగా కొండకోనల్లో పర్వత పంక్తుల్లో నివసించే బిర్ హార్, అసుర్ లేదా ఇతర కొండప్రాంతపు ఆదివాసీ గుంపుల్లో సభ్యురాలి వంటి స్త్రీ ఆమె. అంతర్జాతీయ స్తాయీ గౌరవాలు పొందటం వల్లనో , [...]

ధర్మపోరాటం

10/03/2009

ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డది. ఆమె గర్భవతి యని, ఆమెకడుపులో కవలపిల్లలున్నారని కనుక్కున్నారు డాక్టర్లు . దీనికి కారణం ఆబాలికను రేప్ చేసిన ఆ బాలిక యొక్క మారు తండ్రని తెలిసింది.  అతడు ఆబాలిక ఆరవయేటనుండి అనేక విధాలుగా తిడుతూండేవాడట. ఆబాలిక మరీ బలహీనంగా వుండటం వల్ల ( 32 కిలోలు ), ఆమె గర్భాశయం కనీసం ఒక్క పిల్లనైనా భరించేంత శక్తికూడా లేనందున డాక్టర్లు ఆమెకు అబార్షన్ చెయ్యాలని [...]

4.సామాజిక స్పృహ విప్లవ చైతన్యం

12/02/2009

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా కవి మీద పడుతుంది.
కవిత్వం సామాజిక అభివృద్ధి క్రమంలో పోరాడుతున్న ప్రజల చైతన్య స్ధాయిని బట్టి కూడా వినియోగించాల్సిన భావ ప్రేరణ – ఆ రచన ప్రజల స్థాయి కన్నా కొంచం ముందుగా వున్నా నిష్ఫలమే అవుతుంది. అలాగే వెనుకబడి వున్నా వీగిపోతుంది. కారణం ఆ కవి సమకాలీనంగా ఎదగని దశలో ఉన్నట్లు ఋజువవుతాడు. – [...]

3. సామాజిక స్పృహ వ్యక్తివాదం కాదు

06/02/2009

పాలకవర్గం పరిధిలో ఉండి ఆలోచించే సాహితీ వేత్తలు చిత్రవిచిత్ర వాదనలు ముందుకు తెస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటివాళ్ళు పీడక సాహిత్య లక్షణాల్నికరదీపాలుగా ర్రహించి పీడిత ప్రజలకు పరిష్కారాలు సూచిస్తూ కవి సమాజానికి అతీతుడు ,శాసనకర్త, సర్వస్వమును అని ప్రతిపాదిస్తున్నారు.
ఇంకా కొంచం ముందుకు పోయి కవి ఆధిక్యతా భావాన్ని ఒక వాదంగా ముందుకు తెచ్చే “ కవిసేన “ ను ప్రచారం చేస్తూ మానవ సమస్యల్ని కవులు మాత్రమే పరిష్కరించగలరనే భ్రమల్ని సుస్తిరం చేస్తున్నారు. దీనితో పాటు [...]

తెలుగు కవిత – సామాజిక స్పృహ 2

23/01/2009

2. మార్పును గుర్తించిన ద్రష్టలు
ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో “ క్రాంత దర్శులు “ గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన  “ కన్యక “ బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి “ [...]

తెలుగు కవిత – సామాజిక స్పృహ

22/01/2009

ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో ‘ సామాజిక స్పృహ ‘ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి ‘ సోషలిజం ‘ మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా  వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి ‘సామాజిక స్పృహ‘ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.
సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల [...]

జ్వాలాముఖి

20/01/2009

సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ – అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.
జ్వాలాముఖి – జీవిత విశేషాలు :
జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల [...]

తన విద్యార్ధులకు ఏం చెప్పాలి

09/09/2008

 
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్న స్కూలు ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖ.
“ మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి. శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు [...]

మే దినం – వి.ఐ. లెనిన్

15/06/2007

మే దినం – వి.ఐ. లెనిన్సోదర కార్మికులారా !  ప్రపంచ కార్మికుల గొప్ప పండగ దినం సమీపిస్తుంది.వారు సూర్యకాంతికి మేల్కొని జ్ఞానమార్జించినందుకు సంతోషచిహ్నంగా మే ఒకటవ తేదీని పండగ చేసుకుంటారు. సమస్త పీడనకు వ్యతిరేకంగా , సమస్త నిరంకుశానికి వ్యతిరేకంగా,  సమస్త దోపిడీకి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజ స్థాపనకై పోరాడేందుకు ఒక సోదర బృందంగా ఐక్యమయినందుకు వారు ఆనాడు ఉత్సవం జరుపుకుంటారు. కష్టించి పనిచేసేవారందరూ, తమ కష్టంతో ధనికుల –సామంతుల కడుపులు నింపేవారందరూ, స్వల్పజీతాలకు నడుములు విరిగేటట్లు [...]

లోకాయుత జ్ఞాన సిద్ధాంతం

26/05/2007

జ్ఞాన సముపార్జనకు లోకాయతులు ఇంద్రియాల పైనే ఆధారపడ్డారు. జ్ఞాన సంపాదన కోసం ప్రమాణాలు తార్కికంగా వివిధాలున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తప్రమాణం, ఆగమ ప్రమాణం (వేద ప్రమాణం) ఇట్లాంటివి వున్నాయి.
” ప్రత్యక్షానుమానోపమాన శాబ్దాః ప్రమాణాని…”
” ప్రత్యక్షోహ్యేత య్మోరూలం
కృతాంతై తిహ్య యోరపి|
ప్రత్యక్షేణా గమో భిన్నః
కృతాంతోవా న కించన||”మానవ జ్ఞాన సంపాదనకు ప్రత్యక్షమే పరమావధి.ఎన్ని ప్రమాణాలున్నా ప్రత్యక్షానుభూతికి లొంగక తప్పదు. మతం చూపే ప్రమాణ గ్రంధాలన్నీ అనుభవానికి దూరంగా వుంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష ప్రమాణానికి నిలువవు.ఋజువుకు పనికిరావు. [...]