ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డది. ఆమె గర్భవతి యని, ఆమెకడుపులో కవలపిల్లలున్నారని కనుక్కున్నారు డాక్టర్లు . దీనికి కారణం ఆబాలికను రేప్ చేసిన ఆ బాలిక యొక్క మారు తండ్రని తెలిసింది. అతడు ఆబాలిక ఆరవయేటనుండి అనేక విధాలుగా తిడుతూండేవాడట. ఆబాలిక మరీ బలహీనంగా వుండటం వల్ల ( 32 కిలోలు ), ఆమె గర్భాశయం కనీసం ఒక్క పిల్లనైనా భరించేంత శక్తికూడా లేనందున డాక్టర్లు ఆమెకు అబార్షన్ చెయ్యాలని [...]
