
సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా కవి మీద పడుతుంది.
కవిత్వం సామాజిక అభివృద్ధి క్రమంలో పోరాడుతున్న ప్రజల చైతన్య స్ధాయిని బట్టి కూడా వినియోగించాల్సిన భావ ప్రేరణ – ఆ రచన ప్రజల స్థాయి కన్నా కొంచం ముందుగా వున్నా నిష్ఫలమే అవుతుంది. అలాగే వెనుకబడి వున్నా వీగిపోతుంది. కారణం ఆ కవి సమకాలీనంగా ఎదగని దశలో ఉన్నట్లు ఋజువవుతాడు. - కవి తన చైతన్యాన్ని బట్టిగాక ప్రజల చైతన్యాన్ని బట్టి సామాజిక అవసరాలమేరకు ప్రవర్తించడం అభివృద్ధి క్రమం దృష్ట్యా చాలా అవసరం – ఈ మెలకువ తనమే కవి యుగ కర్తృత్వాన్ని నిర్ణయిస్తుంది.
మార్పును కోరేవారంతా వ్యవసాయ విప్లవం జరగాలంటున్నారు. దాన్ని ఇరుసుగా నడిపి నిజమైన ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలంటున్నారు. ఈ దశలోనే జాతి విముక్తి సాధ్యం కాగలదనేది తేలిన అంశం- ఈ జనతా ప్రజాతంత్ర విప్లవంలో అన్ని రకాల ప్రజల్ని సమీకరించడం , పోరాటానికి ఆయత్తం చేయడం, విప్లవాన్ని సాధించడం అనేవి లక్ష్యాలుగా వుంటున్నాయి. వీటికి మార్గదర్శక సూత్రాలేవి?
మన వ్యవస్ధ శ్రమ దోపిడిని కేంద్రంగా చేసుకొని జీవిత విలువల్ని నిర్ణయించింది. అసంఖ్యాకులకు అన్యాయం చేస్తున్నది. శ్రమదోపిడీ నిర్మూలనను లక్ష్యించే ఫ్యూడల్ వ్యతిరేక ప్రజా ఉద్యమాలకు బాసటగా నేటి సామాజిక స్పృహ సాహిత్యంలో ప్రతిబింబించాలి. అలాగే ఫ్యూడల్ భావాలతో కుమ్మక్కవుతున్న సామ్రాజ్యవాదాల జోక్యందారీ విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్షణాలు కలిగిన సామాజిక స్పృహ నేటి తెలుగు కవిత్వంలో ప్రతిబింబించాలి. భూస్వామ్య విధానం మానవ జీవితాన్ని విషాక్తం చేసింది. దానికి మద్దత్తుగా సామ్రాజ్యవాదం విధానం వలన సంస్కృతిని దిగుమతి చేస్తున్నది. దీన్ని నేటి కవితా ప్రయోజనం ప్రతిఘటించాలి.
వ్యవసాయ విప్లవం అనేది ప్రధానంగా వచ్చినప్పుడు గ్రామీణ స్ధాయి పోరాట ప్రజలకు కవిత్వం అందాలంటే వారి కళారూపాలు స్వీకరించి విప్లవీకరించాలి. జానపద కళా రూపాలు పోరాట చైతన్యంలోకి అనువదించాలి. ఇక్కడ శిల్పం కోసం వస్తువును పాడుచేయరాదు. బాణీ కోసం ప్రజల్ని మభ్యపెట్టరాదు. అలాగే వస్తువు స్పష్టత కోసం కవిత్వాన్ని వాక్యంగా మార్చరాదు. ప్రతి కవిత్వం ప్రచారమే కానీ ప్రతి ప్రచారం సాహిత్య రూపం కాజాలదు. కారణం అది ప్రేరణను కోరుతుంది. ప్రేరణకు ప్రజల నుడికారం చాలా అవసరం. వస్తు రూపాల సమన్వయం సామాజిక స్పృహలో ప్రతిబింబించాలి.
నేటి కవిత్వం అనేది శిల్ప కళా రూపంలో జాతీయం (National in form ) గాను, వస్తువులో విప్లవాత్మకంగానూ ఉండాలి. ( Revolutionary in Content ) ఈనాటి ఈ కవితా ప్రయోజనాన్ని గ్రహించి , నిత్య నూతనంగానూ ప్రజల పోరాట పటిమను బాధ్యతతో రచనల్ని చేయడమే సామాజిక స్పృహ. దీన్ని తెలిసో తెలియకో కాదనే వాదమల్లా స్వీయ మానసిక వికారం కాగలదు. కవి తనకోసం కాక తన చుట్టూ ఉన్న ప్రజలకోసం బ్రతకటమే సామాజిక స్పృహ.
- సెప్టెంబరు 1979

బ్లాగు బాగుంది కానీ తెలుగు బ్లాగుకి ఇంగ్లిష్ టైటిల్ పెట్టడం బాగాలేదు.
trinetram Says:
చాలా ఫిలసాఫికల్ గా ఉన్నట్టుంది వ్యాసం.
ఒ సందేహం, బ్లాగు శీర్షిక My failure stories అని ఎందుకు పెట్టినట్టో.
ఇంకో మాట, వ్యాఖ్యానించడం లాగిన్ అయి ఉన్నవారికే అనడం వలన, చాలా మంది వ్యాఖ్యానించలేరని నా అభిప్రాయం.
Posted on 27/05/2007 at 6:22 అపరాహ్నం
————-
ఇక్కడ నా జీవిత చరిత్ర వ్రాసుకుందామను కున్నాను . కానీ రాసుకోలేకపోయాను. ఏదో రాద్దామను కున్నాను మరేదో రాస్తున్నాను.
స్పామ్ లు నిరోధించడానికి నేను Re-Captcha అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను. అందుకు లాగిన్ ఆప్షన్ కూడా పెట్టకతప్పలేదు.
I didn’t fix login option in English blog http://eng.stalin-mao.net/ If you feel any difficulty for registration in telugu blog, you can post your comment in english blog.
Thanks.
అవును మీరు ఎందుకు మీబ్లాగులో అలాఏర్పాటుచేశారో ఇంతకు ముందే ఒకసారి చెప్పారు. ప్రస్తుతం ఆ రిక్వెస్టు చేసినది నేను కాదు అది అప్పటి నాబ్లాగులో ప్రవేశానికి లాగిన్ అయినవారికే అనే ఆప్షన్ ఉన్నదని దాన్ని తొలగించమని నన్ను అడిగినప్పటిది.
మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టివుంటే మన్నించండి.
వ్యాసం బాగుంది అని చెప్పడానికైనా ఇంగ్లీషుబ్లాగులో కామెంటు రాసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
వార్డ్ ప్రెస్ లో స్పామ్ బోట్స్ ద్వారా మెసేజెస్ పోస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ. అందుకే వార్డ్ ప్రెస్ లో Re-Captcha అనే ప్లగిన్ ఇన్స్టాల్ చెయ్యాల్సి వచ్చింది. ఆ ప్లగిన్ జెనరేట్ చేసే అక్షరాలు అస్పష్టంగా కనిపిస్తాయి. అందుకే నా తెలుగు బ్లాగ్ లో కామెంట్స్ పోస్ట్ చెయ్యడం కొంచెం కష్టంగా ఉంటోంది. ఇంగ్లిష్ బ్లాగ్ లో వార్డ్ ప్రెస్ కాకుండా సెరెండిపిటీ ఇన్స్టాల్ చేశాను. అందులోని Captcha ప్లగిన్స్ లో కూడా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ రిజిస్టేషన్ లేకుండా మెసేజెస్ పోస్ట్ చెయ్యొచ్చు.