2. మార్పును గుర్తించిన ద్రష్టలు
ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో “ క్రాంత దర్శులు “ గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన “ కన్యక “ బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి “ [...]
Archive for జనవరి, 2009
తెలుగు కవిత – సామాజిక స్పృహ 2
23/01/2009తెలుగు కవిత – సామాజిక స్పృహ
22/01/2009ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో ‘ సామాజిక స్పృహ ‘ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి ‘ సోషలిజం ‘ మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి ‘సామాజిక స్పృహ‘ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.
సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల [...]
జ్వాలాముఖి
20/01/2009సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ – అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.
జ్వాలాముఖి – జీవిత విశేషాలు :
జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల [...]
