అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్న స్కూలు ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖ.
“ మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి. శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు [...]
