Archive for జూన్ , 2007

టీచర్ల సమస్యలు

23/06/2007

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ “ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని  “ తీర్పు ఇస్తూ ఆ [...]

మే దినం – వి.ఐ. లెనిన్

15/06/2007

మే దినం – వి.ఐ. లెనిన్సోదర కార్మికులారా !  ప్రపంచ కార్మికుల గొప్ప పండగ దినం సమీపిస్తుంది.వారు సూర్యకాంతికి మేల్కొని జ్ఞానమార్జించినందుకు సంతోషచిహ్నంగా మే ఒకటవ తేదీని పండగ చేసుకుంటారు. సమస్త పీడనకు వ్యతిరేకంగా , సమస్త నిరంకుశానికి వ్యతిరేకంగా,  సమస్త దోపిడీకి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజ స్థాపనకై పోరాడేందుకు ఒక సోదర బృందంగా ఐక్యమయినందుకు వారు ఆనాడు ఉత్సవం జరుపుకుంటారు. కష్టించి పనిచేసేవారందరూ, తమ కష్టంతో ధనికుల –సామంతుల కడుపులు నింపేవారందరూ, స్వల్పజీతాలకు నడుములు విరిగేటట్లు [...]