పరస్పర విరుద్ధ తత్వ శాస్త్రాలు

దోపిడీ తత్వ శాస్త్రం
దీనికి మరో పేరు ‘ అసత్యం ‘
మార్క్సిష్టు తత్వ శాస్త్రం దీనికి మరో పేరు ‘ సత్యం ‘
1) సమాజంలో పూర్వం నుంచీ
రెండు రకాల వాళ్ళు ఉన్నారు.
సోమరులూ, పొదుపరులూ!
సోమరులేమో పేదలయ్యారు.
పొదుపరులు ధనికులయ్యారు.
సమాజంలో రెండు రకాల వాళ్ళు
ఉన్నారనేది నిజమే.కానీ వాళ్ళు
సోమరులూ, పొదుపరులూ కాదు.
దోపిడీదారులూ, శ్రామికులూ!
శ్రామికులే పేదలయ్యారు.
దోపిడీదారులు ధనికులయ్యారు.
2) స్వంతాస్తిని కూడబెట్టుకునే హక్కు
ఎవరికైనా వుంటుంది. ఎవరికి ‘ శక్తి ‘
ఉంటే వాళ్ళు కూడబెట్టుకోవచ్చు.
‘శక్తి ‘ అంటే ,’ ఉత్పత్తి సాధనాల ‘మీద
దౌర్జన్యంగా సంపాదించిన యాజమాన్యమే.
‘స్వంత శ్రమ ‘తో ఏర్పడే ఆస్తి, జీవితావసరాల్ని
తీర్చడానికి మాత్రమే సరిపోతుంది.
ఆ స్థాయిని మించిన ఆస్తికూడితే అది దోపిడీ
ద్వారానే సాధ్యం. దీన్ని కవితాత్మకంగా చెప్తే
‘ఆస్తి చౌర్యమే‘! ‘ఆస్తి ‘ అంటే స్వయంగా శ్రమించే
వాళ్ళ ఆస్తీ, దోచుకొనేవాళ్ళ ఆస్తీ ఒకటికాదు.
” రాజకీయ ఆర్ధిక శాస్త్రం చాలా భిన్నమైన
వేరు వేరు రకాల ఆస్తుల్ని గందరగోళపరుస్తుంది.
వాటిలో ఒకటి- ఉత్పత్తిదారుల స్వంత శ్రమ మీద
ఆధార పడినది. రెండవది- ఇతరుల శ్రమని
నియమించడం మీద ఆధారపడినది” -మార్క్స్
3) వ్యక్తిగత ఆస్తి లేకపోతే
పనిచెయ్యాలనే ఉత్సాహం
ఉండదు.
బానిసలు పని చేసిందంతా వాళ్ళ వ్యక్తిగత
ఆస్తి మీదేనా? ఈనాడు కార్మికులు పని
చేస్తున్నది తమ వ్యక్తిగత ఆస్తులమీదేనా?
స్వంత ఆస్తులు లేకుండానే వాళ్ళు ఎందుకు
పని చేస్తున్నారు? యజమానుల ఆస్తులన్నీ
స్వంత ఆస్తులే కదా? పని చెయ్యటానికి
యజమానులకు ఎందుకు ఉత్సాహం ఉండటం
లేదు? వాళ్ళ ఆస్తే వాళ్ళకు ఎందుకు
ఉత్సాహం ఇవ్వటం లేదు?
4) రాజ్యాంగ యంత్రం
శాంతి భద్రతలు
కాపాడుతుంది.
శతృవులనుంచి
రక్షిస్తుంది.
నిజమే. దోపిదీ వర్గ రాజ్యాంగ యంత్రం ,
దోపిదీ వర్గ శాంతి భద్రతలు కాపాడుతుంది.
దోపిడీ వర్గాన్ని శతృవులనుంచి, అంటే
శ్రామిక వర్గం నుంచి రక్షిస్తుంది. కాబట్టి
రాజ్యంగ యంత్రం రెండు వర్గాల కోసం పని
చెయ్యదు.
5) గత సమాజం మాట
వేరుగానీ, ఇప్పుడు మాత్రం
పెట్టుబడిదారులూ,కార్మికులూ
సమానమే.
కాదు. ఈ సమాజం కూడా గత సమాజాల మారు
రూపమే. ఈ సంబంధం కూడా దోపిడీ సంబంధమే.
యజమానీ సేవకుల సంబంధమే. ఇది కూడా
తప్పుడు సామాజిక సంబంధమే.
(ఫాల్టీ సోషల్ రెలేషన్)
6) స్వార్ధం అనేది
మానవ
స్వభావం
లోనే
వుంది.
మొదట మానవులందర్నీ ఏకం చేసి మాట్లాడడం
తప్పు. మానవులు- వర్గ మానవులే.బానిసకి
స్వార్ధం ఏమిటి? శ్రామికులకు ఉన్న స్వార్ధం
ఏమిటి? తమ శ్రమలో అత్యధిక భాగాన్ని
ఉచితంగా ధారపోస్తూ, యజమాని వర్గానికి,
రాత్రింబవళ్ళూ సేవలు చేయడమేనా?
‘స్వార్ధం ‘ అంతా యజమాని వర్గానిదే.
మానవులందరిదీ కాదు.
7) మానవులు
సహజంగానే
చెడ్డ వారు.
నేరాలు
చేస్తారు.
నేరాలకీ, చెడ్డతనానికీ మూలం దోపిడీయే.
దోపిడీయే పెద్ద నేరం. దాని ఆర్ధిక రాజకీయ
ప్రయోజనాలకోసమే నేరాలన్నీ పుట్టుకొచ్చాయి.
నేరస్తులంతా దోపిడీవర్గం వల్ల తయారైన
వాళ్ళే. శ్రామిక వర్గం చేసే నేరాల్లో కొన్ని
బ్రతుకుదెరువు కోసమూ,కొన్ని దోపిడీవర్గ
ప్రభావం వల్లా జరుగుతాయి. మనుషులు
పుట్టినప్పుడు మంచివాళ్ళూ కారు. చెడ్డవాళ్ళూ
కారు. సమాజమే వాళ్ళని మంచిగానో, చెడ్డగానో
తయారు చేస్తుంది. సమాజంలో నేరాలూ, చెడ్డ
తనమూ ఉన్నాయంటే, ఆ సమాజం బ్రహ్మాండమైన
తప్పులో వుందన్నమాట. దోపిడీ సమాజమే
శాశ్వితంగా కనబడే వాళ్ళకి, దాని లక్షణాలన్నీ
శాశ్విత లక్షణాలుగానే కనబడతాయి. నేరాలు
చెయ్యటమూ, చెడ్డతనమూ మనుషుల శాశ్విత సహజ
లక్షణాలలాగే కనబడతాయి.
8 ) జాతీయ ఆదాయంలో
న్యాయమైన
పంపిణీ
జరగాలి.
శ్రామిక వర్గం నుంచి అదనపు విలువనీ ‘లాగే ‘
విధానం అలాగే వుండాలి. కౌళ్ళూ, వడ్డీలూ,
లాభాలూ అన్నీ అలాగే వుండాలి. కానీ
జాతీయాదాయంలో ‘న్యాయమైన పంపిణీ ‘
‘ న్యాయమైన ‘
9) రాజకీయాల్నిబట్టే
ఆర్ధిక విషయాలూ
వుంటాయి.
కాదు. రాజకీయాలకి ఏదో ఒక ‘లక్ష్యం ‘
వుంటుంది. ఆర్ధిక పునాదిని నిలబెట్టడమో,
నిర్మూలించడమో. ఆ లక్ష్యం కోసమే
రాజకీయాలు అవసరం. కాబట్టి, ఆర్ధిక
విషయాల్నిబట్టి రాజకీయాలు; అంతేగాని
రాజకీయాల్ని బట్టి ఆర్ధిక విషయాలు కావు.
10 ) పేదలకి ‘ న్యాయం ‘
జరగాలి !
పేదలకి
‘ సేవ ‘
చెయ్యాలి !
పేదలే ‘ అన్యాయం ‘! అన్యాయానికి న్యాయం అంటే,
అన్యాయాన్ని అలా ఉంచటమే. అంటే ,పేదల్ని అలాగే
ఉంచి ,వారికి ‘న్యాయం ‘ చేస్తారన్నమాట !
పేదల సేవల్లో ప్రభుత్వాలూ, పేదల సేవల్లో
క్లబ్బులూ, పేదల సేవల్లో స్వచ్చంద సంస్థలూ !
అందరూ పేదల సేవ చేసే వాళ్ళే! పేదల్ని
సృష్టించేదే వీళ్ళు! ‘పేదతనం ఎందుకువుంది ‘
అనే ప్రశ్న మాత్రం వీళ్ళకి పట్టదు. తర తరాల
నుంచి పేదలే మీకు సేవ చేస్తున్నారు.భవిష్యత్తులో
పేదలు మీకు ఇంకా ఘనమైన సేవ చేస్తారు.
మిమ్మల్ని యజమాని పీఠాలమీద నించీ లాగి,
నిజమైన మనుషులుగా మార్చే సేవ పేదలే
మీకు చేస్తారు.
11 ) మానవ
జీవితాన్ని
‘ఆర్ధిక
పరిధి ‘లో
ఇమడ్చకూడదు.
అవును. మార్క్సిజం చెప్పేది కూడా అదే. ‘మానవ
సంబంధాల్ని డబ్బు సంబంధాలుగా వుంచ
కూడదు ‘ అనే. దానికోసం మార్క్సిజానికి ఒక
సిద్ధాంతమూ ,ఒక కార్యక్రమమూ కూడా
వున్నాయి.కానీ మీ దగ్గర అవేమీ లేవు.
మీ దగ్గర వున్నదంతా ‘డబ్బుతో డబ్బుని
పెంచుతూపోయే ‘కార్యక్రమమే. పైగా జీవితాల్ని
డబ్బు పరిధిలో ఇమడ్చకూడదు అనే చిలక
పలుకులూ, దొంగ నీతులూ! మీ ప్రకారం
డబ్బు శాశ్వితం! డబ్బు దోపిడీ శాశ్వితం!
డబ్బు సంబంధాలు శాశ్వితం! కానీ,
‘డబ్బు ‘ని నిజంగా తిరస్కరించే సిద్ధాంతం మాదే.
మార్క్సిజమే !
12) మానవుల స్వేచ్చమీద
నిషేధం వుండరాదు
మానవులు రెండురకాలు. ‘ స్వేచ్చ ‘ కూడా రెందు
రకాలు.దోపిడీదారులు దోపిడీ చెయ్యడానికి
స్వేచ్చ కావాలంటారు.స్వేచ్చకి అది వాళ్ళ
అర్ధం. కానీ, శ్రామికులు దోపిడీ చేసే స్వేచ్చ
ఎవరికీ వుండరాదని అంటారు. ఆ స్వేచ్చ తమకి
కూడా వుండరాదంటారు. స్వేచ్చకి వీళ్ళ
అర్ధం ఇదీ. కాబట్టి స్వేచ్చ కూడా వర్గ
స్వభావం కలదే.దోపిదీ అనేటంత పెద్ద విషయం
అయినా, ‘గోళ్ళని పెంచడం ‘అనేంత చిన్న విషయం
అయినా ఎవరి స్వేచ్చ వాళ్ళదికాదు. సమాజంలో
ఇతర మనుషులతో కలసి జీవిస్తున్నప్పుడు
సమాజానికి ఏరకంగానూ హాని కలిగించని
విధంగా , స్వేచ్చ పరిమితమై వుండాలి.
‘నా గోళ్ళు నాయిష్టం ‘ అని ఒక మనిషి
బారెడు బారెడు గోళ్ళని పెంచి తిరుగుతూవుంటే.
ఆ మనిషిని పట్టుకొని ఆగోళ్ళని కత్తిరించి
వెయ్యడానికి అందరికీ స్వేచ్చ వుంటుంది.అది
సమాజ ఆరోగ్య రక్షణకి ఆత్మరక్షణకీ
అవసరం.అదీ స్వేచ్చకి అర్ధం
13) నిమ్నవర్గాలు ఇప్పుడు
మారిపోతున్నాయి.
ఫలానా దేశములో
ఫలానా నిమ్నవర్గ
వ్యక్తిని తీసుకోండి.
ఉదా|| భారత దేశంలో
అంబేద్కర్ ని తీసుకోండి.
ఆయన ఎంత
అభివృద్ధి చెందాడు!
ఒక వ్యక్తి అభివృద్ధే మొత్తం వర్గ అభివృద్ధి
కాదు; అంతేగాక, అంబేద్కర్ అభివృద్ధి ఆ వ్యక్తి
నిజమైన అభివృద్ధి కాదు.శ్రామిక వర్గం
వాడైన అంబేద్కర్ మార్క్సిజం గురించి తెలిసి
కూడా అది పనికిరాదని తన రచనల్లో
ప్రకటించడంవల్ల శ్రామిక వర్గానికి గాక
పెట్టుబడిదారీ వర్గానికే మేలు జరిగింది.
” పాలకవర్గం పాలిత వర్గపు మేధావుల్ని
ఎంత ఎక్కువగానైతే తనలో ఇముడ్చుకుంటుందో ,
అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ
దాని పాలన తయారవుతుంది ” -మార్క్స్
(కాపిటల్ -3,పేజీ -601)
14) ఆస్తులకు పెట్టుబడిదారులు
ధర్మకర్తలుగా (ట్రష్టీలుగా)
ఉంటారు. కార్మికులు దేశభక్తులుగా కష్టించి పని చేస్తారు.(భారత దేశపు ఆధునిక తత్వవేత్త అయిన
మహాత్మాగాంధీ గారి ట్రష్టీ
షిప్పు సిద్ధాంతం. “షోషలిజం
ఆఫ్ మై కన్ సెప్షన్ ” -అనే
పుస్తక సారాంశం)
ఏం? ఆస్తులకు కార్మికులే
ధర్మకర్తలుగా వుండి,
పెట్టుబడిదారులే
కష్టించి పనిచేసే
దేశభక్తులుగా
ఎందుకు వుండకూడదు?
15)”మళ్ళీ జన్మ అంటూవుంటే
పాకీ వాడిగా పుడతాను “-
మహాత్మా గాంధీగారు.
మళ్ళీ జన్మదాకా ఎందుకూ? చెయ్యదలచుకున్న
సత్కార్యాన్ని మళ్ళీజన్మదాకా వాయిదావేసి
ఈ జన్మని వృధాచెయ్యడమెందుకూ? ఆ కార్యం
ఈ జన్మలోనే ఎందుకు ప్రారంభించకూడదూ?
16)’ షోషలిజంలో రాజు, రైతూ – ధనికుడూ, పేదా, యజమానీ-ఉద్యోగీ -అందరూ సమాన
స్థాయిలో వుంటారు” భారత తత్వవేత్త
మహాత్మా గాంధీగారు. (షోషలిజం
అఫ్ మై కన్ సెప్షన్ పేజీ-1)
గాంధీగారి ‘సోషలిజం ‘లో -ఒకవేపు రాజులూ,
ధనికులూ,యజమానులూ; ఇంకోవైపు రైతులూ,
పేదలూ,శ్రామికులూ- అందరూ ఎప్పటిలాగే
వుంటారు. కానీ అందరూ సమాన స్థాయిలో
వుంటారు! ఈ ‘సమాన స్థాయి ‘ ఏవిషయంలో?
ఏమో దాన్ని వారు వివరించలేదు.సమాన స్థాయీ,
సోషలిజమూ అనే మాటల్ని మాత్రం గాంధీగారు
కూడా తన తత్వశాస్త్రంలోకి చేర్చుకోక తప్పలేదు.
17) ‘భూస్వాములు
తమ మిగులు భూమిని
పేదవర్గాల కోసం
దానం చెయ్యాలి ‘
భూదానోద్యమ తత్వవేత్త
అయిన వినోబాభావే.
‘ మిగులు ‘భూమి! ‘మిగులు ‘ అంటే? భూస్వాములు
తమకు ఇష్టమైనంత తీసుకోగా ,దాచుకోగా,
ఆ పైది ఎంతోకొంత! భూస్వామి, తనకోసం
తీసుకున్న భూమిని భూస్వామి కుటుంబమే
స్వంత శ్రమతో పండించుకుంటుందా? దాన్ని కూడా
వ్యవసాయ కార్మికులే పండిస్తే ,జీతాలూ,
అదనపువిలువా అంతా ఎప్పటిలాగే. ఈ సమస్యని కూడా
భూదానొద్యమం ఎలపెరిష్కరిస్తుంది?
18) సమాజం నాకేమిచ్చిందని
కాదు. సమాజానికి
నేనేమిచ్చానని చూడాలి.
ఎప్పుడూ ‘ వ్యక్తి ‘నుంచీ లాగడమే చేసే సమాజం ఇలాంటి సూక్తులే చెపుతుంది. ‘ తీసుకోవడం ‘ ఉన్న ప్రతీ చోటా ‘ ఇవ్వడం ‘ కూడా వుండాలి. ‘ సమాజానికి నేనే మిచ్చాను ‘ అని ప్రశ్నించుకునే వ్యక్తికి , ‘ సమాజం నాకేమిచ్చింది ‘ అని ప్రశ్నించడానికి కూడా హక్కు వుంటుంది. ఎప్పుడూ తీసుకోవడమేగాని ఇవ్వడం చెయ్యని సమాజం వ్యక్తులకు ఏ మేలూ చెయ్యదు.వ్యక్తి, సమాజం కోసం అయితే, సమాజం వ్యక్తి కోసం కూడా! వ్యక్తికి , సమాజానికి వైరుధ్యం వుండరాదు. రెండూ వేరు వేరు కాదు. రెండింటి శ్రేయస్సూ ఒక్కటే.
19) మత గ్రంధాలన్నీ
సర్వజనుల సుఖాన్నే
చెప్పాయి.’గీత ‘లో
చూడండి,’బైబుల్ ‘లో
చదవండి.’ఖురాన్ ‘ లో
పరికించండి. ‘సర్వే
జనా సుఖినో భవంతు ‘
అన్నారు మన పెద్దలు.
అన్నారు సరే! ఇప్పుడు సర్వజనమూ సుఖంగా
ఎందుకులేరో, కొంతమంది జనం దుఃఖంగా ఎందుకు
వున్నారో ఏం కారణం చెప్పాయి మత గ్రంధాలన్నీ?
‘దోపిడీ’ని చెప్పాయా ? సర్వజనమూ సుఖంగా
వుండేవిధంగా సమాజాన్ని మార్చడానికి
మార్గం చెప్పాయా? ‘వర్గ పోరాటం ‘చెప్పాయా?
దేవాలయాల్లోనూ,చర్చీల్లోనూ,మసీదుల్లోనూ
నిరర్ధకంగా మోకరిల్లడం తప్ప, నిజజీవితాల్ని
మార్చగలిగే ఒక్క జ్ఞానవంతమైన మాట చెప్పాయా?
‘సర్వేజనా సుఖినోభవంతు ‘అనగానే ‘సుఖినో
భవంతు ‘ అవుతుందా? ‘మంత్రాలకు చింతకాయలు
రాలవనే ‘ మామూలు సంగతి కూడా మత
గ్రంధాలకి తెలియదు కదా?
20) వర్గపోరాటం హింస. ఆమాట అనేముందు దోపిడీవర్గం తన సమస్త
ఆయుధాల్నీ త్యజించాలి.తన పోలీసునీ,
కోర్టుల్నీ, జైళ్ళనీ,సైన్యాన్నీ అన్నిటినీ
రద్దు చెయ్యాలి. సమస్త ఆయుధాల్నీ పెట్టుకు
కూర్చున్నదీ దోపిడీ వర్గమే.యుగయుగాలుగా
వూహాతీతమైనంత హింస చేస్తున్నది దోపిడీ
వర్గమే.శ్రామిక వర్గాన్ని అణచడానికి
చేసేదే హింస.ఆహింసనుంచి బయటపడటానికి
ఎదురుతిరగడం హింస కాదు.అది ఆత్మరక్షణ
కోసం పోరాటం.విముక్తిచెందడం శ్రామిక వర్గం
హక్కు.ఆహక్కుని గ్రహించి దోపిడీ వర్గం స్వచ్చందం
గానే, తన దోపిడీని వదులుకుంటే , ఫోరాటమూ
వుండదు, హింసా వుండదు. హింసకి కారణం
మొదటినుంచీ దోపిడీ వర్గమే.
21)” యజమానులు
మేనేజిమెంటు పనిని
కూడా మానుకుంటే
‘తత్వ శాస్త్రం ‘
చదువుకోవచ్చు”.
-అరిస్టాటిల్
మరి, పనివాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి తత్వశాస్త్రం?
యజమానులు కూడా పనివాళ్ళతోపాటే పనిలోకి దిగితే
అప్పుడు అందరికీ పనికాలం తగ్గుతుంది.అప్పుడు అందరూ
తత్వశాస్త్రం చదువుకోవచ్చు.

-మార్క్స్ కాపిటల్-5వ భాగం నుండి.
పరిచయం:శ్రీమతి .రంగనాయకమ్మ

8 Comments

  1. 1
    trinetram Says:

    మంచి rebel మరియు cynic లా ఉన్నారు.
    ఈ వీడియో చూడండి. http://www.youtube.com/watch?v=fiJrEG6E6gM
    వీలైతే, మీ ఫీలింగ్స్ ని కళ గా మర్చుకోవచ్చు.

    Please disable comments by logged in users only.

  2. 2
    Marthanda Says:

    >>”మళ్ళీ జన్మ అంటూవుంటే పాకీ వాడిగా పుడతాను “- మహాత్మా గాంధీగారు. >>
    గాంధీ ఒక దొంగ సన్నాసి. అహింసావాదం పేరు చెప్పి జనాన్ని తిరుగుబాటు చెయ్యలేని చేతకాని వాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించిన దోపిడీ వర్గ ఏజెంట్. గాంధీ అహింసావాది కాదు. టాల్స్టాయ్, లెనిన్, మావో తదితరులే నిజమైనా అహింసావాదులు.

  3. 3
    Marthanda Says:

    వాక్ గారు, గాంధీ గాడ్ని పొరపాటున కూడా గారు అనకూడదు. గాంధీ గాడు భగత్ సింగ్ ఉరి శిక్షని కూడా సమర్థించాడు. మనకి భగత్ సింగ్ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా గాంధీ లాంటి గుంట నక్కలకి ఏ మాత్రం మర్యాద ఇవ్వకూడదు.

  4. 4
    vak50 Says:

    ప్రచండ గారూ, గాంధీ గారిని మీరు బాగా అర్ధం చేసుకోవాలి. గాంధీ గారు చాలా గొప్పవారు. గొప్ప రాజనీతిజ్ఞుడు. గొప్ప ప్రజా నాయకుడు, ప్రజల అభిప్రాయాలను మార్చడం అంత తేలిక కాదు. ఆ కాలం నాటి ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వమును ఎదిరించాల్సిన అవసరం లేదు. ఎందరో నాయకులు ప్రయత్నించారు. కానీ ప్రజలను మార్చలేకపోయారు. గాంధీగారు ప్రజలను బాగా అర్ధం చేసుకున్నవారు గనుకనే ప్రజలను సమీకరించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులను శాంతియుత విధానాల ద్వారానే ఎదిరించి స్వాతంత్ర్యాన్ని సాధించగలిగారు. అయితే ప్రజలను సమీకరించడానికి గాంధీగారు ఎంచుకున్న విధానాలు మీకు నచ్చివుండకపోవచ్చు.అంతవరకూ సూటూబూటూ ధరించిన వ్యక్తి ఒక సాధారణ పేదవాని వలే చొక్కాకూడా ధరించకుండా గెటప్ మార్చడం అనేది మీలాంటి మేధావులకు ఒక మోసపూరిత చర్య లాగా కన్పంచడంలో తప్పేమీలేదు కానీ అదొక ఎత్తుగడ. గాంధీజీ అటువంటి ఎత్తుగడలతోనే ప్రజలను సమీకరించగలిగారు. ఒక్కబొట్టయినా రక్తం కారకుండ రాజ్యాధికారం బ్రిటీష్ వారిచేతుల్లోంచి నెహ్రూ గారిచేతికి మారడానికి నిర్మాత నెహ్రూగారు అయితే కధ స్క్రీన్ ప్లే మాటలూపాటలూ దర్షకత్వం గాంధీగారిదే.
    ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పై వ్యాసకర్త అభిప్రాయం కాదు. ఈ విషయం మీ బ్లాగు లో రాయడానికి ఎంత ప్రయత్నించినా వీలవలేదు. వర్డ ప్రెస్ అనుమతించలేదు. లక్కీగా మీరే నాబ్లాగులోకి వచ్చారు. మీ అభిప్రాయం తెలియపరచినందుకు చాలా థాంక్స్.

  5. 5
    Marthanda Says:

    నా బ్లాగ్ లో గాంధీ పేజిని తాత్కాలికంగా లాక్ చేశాను. పేజి చదవగలరు కానీ కామెంట్లు పోస్ట్ చెయ్యలేరు. గాంధీ లాంటి గుంట నక్కలని నమ్మడం ప్రమాదకరం. టాల్స్టాయ్ కూడా మహాత్ముడే కానీ అతను గాంధీ లాగ చొక్కా విప్పుకుని దొంగ నాటకాలు ఆడలేదు.

  6. 6
    వాక్ 50 Says:

    ప్రచండ గారూ. మీ బ్లాగు లోకి ఎవరూ ప్రవేశించనీయకుండా మీరే అడ్డుకుంటున్నారా ? ఎందుకు సార్. ఓహో గాంధీగారిని మీరు విమర్శించబోతున్నాను గనుక అందరు తలాకాసిన్ని అక్షింతలు జల్లుతారని భయపడ్డారా… ఆహా …ఏమి తెలివితేటలండీ. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఇలా అంటాడు.. ” మా యింటి దగ్గర నన్ను వెయ్యి మంది కూడా కొట్టలేరు . ఎందుకంటే మాది ఇనపగడి ” అంటే ఇంట్లో దూరి తలుపేసుకుంటాడన్నమాట.
    దీనిని బట్టి నాకు అర్ధమైనదేమిటంటే మీకు ఆల్రడీ కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటిని మార్చుకోవడానికి మీకు ఇష్టం లేదు. మీ అభిప్రాయాలు అనేకమందికి నచ్చవని కూడా మీకు తెలిసీ, మీరీ బ్లాగ్యుద్ధం చేస్తున్నారన్నమాట. మీరు పూర్వజన్మలో ఘటోత్కచుడో , కుంభకర్ణుడో అయి వుంటారు కదా…
    నా ఉద్దేశ్యమైతే మనకు అనేక అంశాలపై కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని ఉంటాం… వాటిని నిరంతర అధ్యయనం ద్వారా , పరిశీలన ద్వారా అప్ డేట్ చేసుకోవడమే ఎడ్యుకేషన్. అహ్. కుదరదు. నాకు ఏదైతే తెలుసో అదే ఫైనల్ అనకూడదని నా సలహా.
    ఎనీవే.థాంక్నెలాట్.

  7. మొదట్లో కామెంట్లని అనుమతించాను. నేనేదో మత ప్రవక్తని విమర్శించానని భావించి దాన్ని కాంట్రోవర్సీ చెయ్యడానికి కొందరు ప్రయత్నించారు. ఒక అజ్నాత సభ్యుడు నా గురించి సేమ్ మేటర్ అనేక సార్లు స్పామ్ చేస్తూ అనేక బ్లాగుల్లో వ్రాసాడు. అందుకే ముందు జాగ్రత్త తీసుకుని కామెంట్స్ తాత్కాలికంగా లాక్ చేశాను. అంతేకానీ నేను పిరికివాడ్ని కాను.

    http://telugu.stalin-mao.net/?p=151

  8. >>మీరు పూర్వజన్మలో ఘటోత్కచుడో , కుంభకర్ణుడో అయి వుంటారు కదా…>>
    మనం గతితార్కిక భౌతికవాదులం, మనం ఈ పుక్కిటి పురాణాల గురించి అసందర్భంగా ప్రస్తావించకూడదు.


RSS Feed for this entry

Leave a Comment