రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది. అంటూ చాలామంది ఎంతో బాధపడుతూ పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.
ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఈగ చూపు తో సమాజాన్ని చూస్తున్నాయి.అంటే ఎక్కడ తప్పులాగా కనిపిస్తుందా అని చూస్తున్నాయి. ఇక్కడ 6000 స్కూళ్ళు మూతబడుతుండడమే చూసారుగాని 6 లక్షల ప్రైవేటు స్కూళ్ళు ఏర్పడిన విషయం విస్మరించారు. మీకు అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది చూడండి. నేటి బూర్జువా సమాజమును మోస్తున్న ఐరావతాల్లో ఒకదానిపేరు అవినీతి.మీరు బాగా చూస్తే అది ఒక్క డిపెప్పులోనేగాదు సర్వత్రా మీకు దర్శనమిస్తుంది.ఆ అవినీతి సొమ్ముకు ఆసెపడే మన ప్రబుత్వ సారధులు విద్యను ప్రైవేటు పరం చేస్తూ ‘విద్యా వ్యాపార సంస్థలను ‘ నిర్వహించుకొనుటకు అనుమ తించారు;తిస్తున్నారు;తిస్తారు. చూడండి తగిన వసతులు,బోధకులు లేకున్నా అనేక కళాశాలలకు అనుమతులొస్తున్నవిషయం తమకు తెలియందికాదు. మీరు/మనం మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదు.ఎందుకని? ఒకటి రెండు ఉదాహరణలు చూదాం. మనకు బి.ఎస్.ఎన్.ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలప్రకారం ప్రైవేటు సెల్లు కంపెనీల లాభాలు తగ్గకుండా ఎంత చక్కగా వ్యాపారం నిర్వహిస్తుందో మీకు తెలుసు ,మనకు అనారొగ్యం సంప్రాప్తిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొవాలి అనే ఆలోచనే మనకు కలుగనంత చక్కగా ప్రభుత్వము ప్రభుత్వ ఆరొగ్య కేందాలను నడుపుతున్న విషయం మీకు ఈ సందర్భంగా గుర్తుకొచ్చే అవకాశెముంది, మీరు హైదరాబాదు వంటి నగరాలకు వెళ్ళవలసిన పనివుంటే మీరు ప్రైవేటు బస్సుల ఆపరేటర్లవద్దకు వెళ్ళే ముందు ఆర్ టీ సీ కి ఫోను చేసి ఖాళీలు లేవనిపించుకున్న సంఘటన గుర్తుకొచ్చే ఉండాలి ఎందుకంటే మన(?) ప్రభుత్వం ప్రైవేటు రవాణా రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది.
కనుక ప్రభుత్వం ప్రజాసేవ తానుచేయకుండా ప్రైవేటు వ్యక్తులచేత ప్రజాషేవ చేయించుటకు ప్రయత్నిస్తున్నవిషయం మనకు అర్ధమౌతుంది. ఒకవేళ ప్రభుత్వం తానే ప్రజా సేవ చేస్తే – మన పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతారు,మనం ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్యం పొందుతాం,ఆర్ టీ సీ లో ప్రయాణం చేస్తాం,చౌక ధరల దుకాణంలో సరుకులు కొనుక్కుంటాం. అంటే మన జేబునిండా డబ్బులుంటాయి. మరి ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందీ అంటే ఏమనాలి? మనల్ని జేబులుగొట్టేవాళ్ళకి అప్పగించిందిగాక ప్రభుత్వ నిర్ణయాల వలన ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం , ప్రైవేటు సంస్తల ప్రజా సేవకులూ కలసి ఆ తప్పును ప్రభుత్వ ఉద్యోగులమీదికి తోస్తున్నారు ఎందుకని?
సరే ఇక పాఠశాలల విషయానికొస్తే ఈ సమస్య (పిల్లలు లేకుండా పాఠశాలలు నడపాల్సిరావడం )కేవలం పట్టణాలకు, పరిసర గ్రామాలకు ఉంది.పట్టణాలలో ప్రయివేటు విద్యాదాతలు కులాలవారీగా, విద్యార్ధుల తల్లిదండ్రుల ఆర్ధిక స్థితులకు అనుగుణంగా విద్యా వ్యాపార సంస్థలు స్థాపించి ,ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలవడానికి ఎన్నిరకాల ఎత్తుగడలు (కులం,మతం,సారా,డబ్బు,ప్రలోభాలు) చేస్తుంటారో అలాగే ఈ విద్యా వ్యాపారం కూడా అన్నిరకాలుగా నిర్వహింపబడుతుంది.వారి సంస్తలో ఒక్కర్ని చేర్పిస్తే 5 శాతము బ్రోకరేజి, అందమైన ఆడపిల్లలకు ఫీజులో రాయితీ(ఆ అమ్మాయి కోసం చాలామంది అబ్బాయిలు చేరతారు), ఎక్కువమంది పిల్లల్ని చేరిస్తే టీచరు పొస్టు, పల్లెటూరు నుంచి వచ్చి చేరేవారిని మరీ దారుణంగా మోసం చేస్తారు.పిల్లవాని స్థాయికి మించిన ప్రశ్నేలు అడిగి వారిని క్రింది తరగతిలో చేర్చుకుంటారు ,మరీ కొన్ని చోట్లనయితే ప్రతి తరగతికి 20 ప్రశ్నె జవాబులను నోట్సుగా చెప్పి దానిలోనే అన్ని పరీక్షలలో ప్రశ్నలు ఇచ్చి గొప్ప మార్కులు సంపాదిస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతారు,ఇక బొధన ఒట్టిమాటే, ఎదుటి సంస్తలో వేగుల్ని ఏర్పరచి ఆ సంస్థలు మూతబడేలా చెయ్యడం ఇలా వాళ్ళను గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు.
ఇక పెద్దగ్రామాలలో నాలుగు బడులుంటాయి.మాలబడి (ఎల్.ఈ./ఎస్.సీ.), మాదిగబడి(ఏ.ఏ.), సాయిబులబడి(ఉర్దూ), ఊళ్ళోబడి(హెచ్.ఇ./హిందూ). స్కూలుకు 20 మంది పిల్లల చొప్పున 80 మందికి అంటే స్కూలుకు ఇద్దరు చొప్పున 8 మంది అయ్యవార్లు. మరి అయితే ఈ నాలుగు స్కూళ్ళు కలిపి ఒకస్కూలుగా చేస్తేమంచిది. ఏమంటారు?

పేదవాళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళు ముయ్యించేసి డబ్బున్న వాళ్ళ పిల్లల కోసం అవసరం కంటే ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజిలకి లైసెన్సులు ఇస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజిలలో సీట్లు మిగిలిపోతున్నా మన పాలకులు కళ్ళు తెరిచి చూడడం లేదు.
[...] కొంత వరకు మెరుగుపడతాయనుకుంటాను. స్కూళ్ళ పరిస్థితి గురించి వాక్ 50 గారు… చదివాను. ఇతర ప్రభుత్వ శాఖలలాగే [...]