Archive for ఏప్రియల్ , 2007

6000 స్కూళ్ళు మూత

16/04/2007

రాష్ట్రం లో దాదాపు 6000 స్కూళ్లు మూతపడనున్నాయన్న వార్త మన సమాజపు “అభివృద్ధి” ఎంత మేడిపండు వంటిదో నిరూపిస్తుంది.    అంటూ చాలామంది ఎంతో బాధపడుతూ పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.
   ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఈగ చూపు తో సమాజాన్ని చూస్తున్నాయి.అంటే ఎక్కడ తప్పులాగా కనిపిస్తుందా అని చూస్తున్నాయి. ఇక్కడ 6000 స్కూళ్ళు మూతబడుతుండడమే చూసారుగాని 6 లక్షల ప్రైవేటు స్కూళ్ళు ఏర్పడిన విషయం విస్మరించారు. మీకు అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది చూడండి. నేటి బూర్జువా సమాజమును [...]

నేనెందుకు నాస్తికుణ్ణయ్యాను? ( -భగత్ సింగ్ )

16/04/2007

సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న.ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని , దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము కూడా కారణమని నా మితృలుకొందరు నాతోవున్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు.వీళ్ళు నామిత్రులని అనుకోవడం ఎంతవరకు సరైందో తెలియదు.ఈ [...]

మా గూడెంలోకి రా

16/04/2007

అమ్మే
నువాంది నిజమే సామే!
అగ్గురారాల్లో ఏముంటది
బెమ్మమొకం నుంచి ఊడిపడ్డట్టు ఆంకారం ఈసు
ఉచ్చులు తగిలిచ్చే ముచ్చు మడుసులు
కడుపుల నిండా బెమ్మజెముళ్ళు
అబద్ధాల మాయల మంత్రాల బతుకులు
కట్టుబాట్ల కట్టుమడులు
అన్నీ వదిలి రా
మా గూడెంలోకి రా
మడులు గుడులు అగ్గురారాలొదిలి
గాటి బతుకునొదిలి
మా గూడెం మనుసుల మజ్జెకి పా
పోదాం పా
 గెడ్డి పూలు పూసినట్టు
మంచు బొట్లు రాలినట్టు
సల్లగాలి తోలినట్టు
వడగాలి కొట్టినట్టు
వానతుంపర రాలినట్టు
బళ్ళున తెల్లారినట్టు
మావోళ్ళ నవ్వులుంటయి
సెమటోసనో సేనోసనో మట్టోసనో
మన్నులో పుట్టిన మొక్కలసుమంటి పసరు వాసనో
మా గూడెపోళ్ళ బతుకు వాసన
నీకిట్టమైతదో కట్టమైతదో సూద్దువు పా
పోదాంపా, మా గూడెం మణుసుల మజ్జెకి
 ఒక సెంప [...]